వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఎస్పీ గాలం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 14-07-2005

Chiranjeeviహైదరాబాద్‌:ఎంజిఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత దక్షిణాదిలో సినిమానటుల కొత్త పార్టీల ఆలోచనలుఎందుకు కలిసిరావడం లేదు?తమిళనాడులో రజనీకాంత్‌,అంధ్రప్రదేశ్‌లో చిరంజీవి సొంతంగా పార్టీలు పెట్టాలన్నఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్నారు. బాబాసినిమా ద్వారా జనం నాడి తెలుసుకోడానికిప్రయత్నించిన ఆయన ఆ సినిమా ఫ్లాప్‌కావడంతో రాజకీయాల జోలికిపోవద్దనుకున్నారు. ఆయనకుఏకలవ్య శిష్యుడైన విజయకాంత్‌సెప్టెంబర్‌లో సొంత పార్టీ పెట్టబోతున్నారు.హీరోల గ్లామర్‌కు సిద్ధాంత బలం తోడుకాకపోతే ఆ పార్టీలు మనుగడసాగించలేవు. విజయ్‌కాంత్‌ పార్టీప్రతిపాదనకు మిశ్రమ ప్రతిస్పందనఉంది. ఎఐఎడిఎంకు పట్టు ఉన్న కొన్ని గ్రామీణప్రాంతాల్లో మాత్రమే విజయకాంత్‌కు ఓట్లుపడే అవకాశముంది. రాజకీయాల్లోకివచ్చినా సినిమాల్లో నటిస్తానని ఆయనఅభిమానులకు సర్దిచెప్పుకుంటున్నారు.

శక్తివంతమైనద్రవిడ ఉద్యమం ద్వారా కరుణానిధి, ఎంజిరామచంద్రన్‌లు బలమైన రాజకీయశక్తులుగా ఎదిగారు. జయలలిత ఎంజిఆర్‌వారసత్వాన్ని కొనసాగిస్తూ మాస్‌ నాయకురాలిగా ఎదిగారు.ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనిస్ధాపించి తొమ్మిది నెలల్లోనే తిరుగులేనిమెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దానికి ఆయన గ్లామర్‌ ఒక్కటే కారణంకాదు. ఆయన అనుసరించిన సామ్యవాదసిద్ధాంతాలు కూడా కారణం. ఆనాడు ఆయన చుట్టూ ప్రగతిశీలశక్తులు వచ్చి చేరాయి.కర్ణాటకలో రాజ్‌కుమార్‌కు రాజకీయాలమీద ఆసక్తి లేదు. ఒకవేళ ఆయనరాజకీయాల్లోకి వచ్చినా సిద్ధాంత బలంలేకపోతే దెబ్బతిని ఉండేవారు.

ఇకఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లోకి రావాలావద్దా అన్న సంశయంలో ఇప్పటికీ ఉన్న చిరంజీవిది మరోదారి. ఆయన సొంత పార్టీపెడితే సమాజంలో విభిన్న వర్గాల ఆయనచుట్టూ ర్యాలీ అవుతాయని గతంలో ఎన్టీఆర్‌కుసలహాదారుగా ఉన్న తుర్లపాటిసత్యనారాయణ అభిప్రాయ పడేవారు.ఇటీవల మరణించిన ఆయన గతంలోదాసరి, చిరంజీవిలను ఒక త్రాటి మీదికి తీసుకువచ్చి ఒక సామ్యవాదపార్టీ ఏర్పాటుకుకృషి చేశారు. కానీ చిరంజీవి గత అసెంబ్లీఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పరోక్షమద్దతు ఇవ్వడంతో ఆయన తనప్రయత్నాలను విరమించుకున్నారు.

తాజాగాములాయం సింగ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ నుంచి చిరంజీవికి ఫీలర్లు వస్తున్నాయి.దక్షిణాదిలో సమాజ్‌వాది పార్టీని విస్తరించాలనుకుంటున్నయుపి ముఖ్యమంత్రి ములాయం సింగ్‌కర్ణాటకలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిబంగారప్పను సమాజ్‌ వాది పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా నియమించారు. మనరాష్ట్రానికి చెందిన జయప్రదనుఉత్తరప్రదేశ్‌ నుంచి సమాజ్‌వాది పార్టీతరఫున గెలిపించిన ములాయం ఆశలు ఆంధ్రప్రదేశ్‌వరకు చిరంజీవిమీదనే ఉన్నాయి. చిరంజీవిని సమాజ్‌వాది పార్టీరాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి వచ్చేఎన్నికల్లో రాష్ట్రంలో సునాయాసంగాఅధికారం చేజిక్కించుకోవచ్చని ములాయం విశ్వాసంతో ఉన్నట్టుచెబుతున్నారు.

ఢిల్లీ,ముంబాయిలలో అద్భుతాలు చేయగలఅమర్‌సింగ్‌ అమితాబ్‌ బచ్చన్‌ వంటి సూపర్‌ స్టార్‌ను,అనిల్‌ అంబానీ వంటిమెగా పారిశ్రామిక వేత్తను సమాజ్‌వాదిపార్టీ సానుభూతి పరులుగా మార్చగలిగారు.చిరంజీవిని ఒప్పించే పనిని కూడా అమర్‌సింగ్‌ భుజానవేసుకున్నట్టు తెలిసింది. అమర్‌సింగ్‌,జయప్రద త్వరలో చిరంజీవినికలుసుకోనున్నారు. సొంత పార్టీ పెట్టాడానికికొన్ని ఇబ్బందులున్నాయని గతంలోతటపటాయించిన చిరంజీవి కూడా జాతీయ పార్టీగామారనున్న సమాజ్‌వాది పార్టీ నుంచి వచ్చిన అవకాశాన్ని లైట్‌గాతీసుకునే అవకాశం లేదు. మరిన్నివివరాలను కొద్ది రోజుల్లో ఇక్కడే మీకుఅందిస్తాం.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X