అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 03-08-2005
హైదరాబాద్: అనుకున్నంతా అయింది. అమెరికన్ కాన్సలేట్ దక్షిణాది ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో కాకుండా బెంగుళూరులో ఏర్పాటు కానుంది. ఈ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో పెట్టాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సలేట్ కార్యాలయం ఉండడం వల్ల ఉపయోగాలను అమెరికన్ అధికారులకు వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలోఅప్ చేయకపోవడం వల్ల, కర్నాటక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఈ కార్యాలయం బెంగుళూరులో ఏర్పాటు కానుంది.
అమెరికన్ కాన్సలేట్‌కు ఏటా మనరాష్ట్రం నుంచి దాదాపు లక్షా యాభైవేల వీసా దఖాస్తులు అందుతుండగా, కర్నాటక రాష్ట్రం నుంచి దాదాపు రెండు లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. గత ఏడాది మన రాష్ట్రం నుంచి లక్షా డెబ్బై అయిదు వేల వీసా దరఖాస్తులు వెళ్ళగా, పదివేల బిజినెస్ వీసాలను, 40 వేల స్టూడెంట్ వీసాలను, 9 వేల హెచ్‌వన్ వీసాలను, 15 వేల విజిట్ వీసాలను జారీ చేశారు. కర్నాటక నుంచి వీసా దరఖాస్తుదారుల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ అమెరికా సందర్శిస్తున్న జనం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌కు రావాల్సిన అమెరికన్ కాన్సలేట్ కార్యాలయం చేజారిపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడం వల్లనే ఇల్లా జరిగిందని టిడిపి విమర్శించింది. రాష్ట్రంలో ఏర్పాటు కావలసి ఉన్న నోకియా ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలిపోయిన విషయం తెలిసిందే.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
