వెలుగులేనిచంద్రుడు
హైదరాబాద్:చంద్రబాబు నాయుడికి ఇప్పుడు నందమూరితారక రామారావు కలలో కనిపిస్తుండవచ్చు.ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడుఎన్నడూ లేనంత కష్టాల్లో ఉంది. ఆ పార్టీవ్యవస్ధాపకుడిగా ఆయన ఈ దుస్ధితి చూసిచంద్రబాబు నాయుడికి కలలో అయినా కొన్నిసలహాలు ఇస్తారేమో! ఇటీవల మునిసిపల్‌ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. చంద్రబాబు నాయుడు కాలుకి బలపాలుకట్టుకుని అన్ని మునిసిపాలిటీలు తిరిగివచ్చినాఫలితం ఇంత ఘోరంగా ఉండడంఆయనకూ దిగ్భాంతి కలిగించి ఉండవచ్చు. గతఅసెంబ్లీ ఎన్నికల నాటికి దూరమైన కొన్నివర్గాల వారిని చేరువ చేసుకోవడంలో చంద్రబాబుఘోరంగా విఫలమయ్యారు. విఫలమయ్యారనడంకంటే ఆయన ఆ దిశగా ప్రయత్నమే చేయలేదనిచెప్పాలి.
తెలుగువారి ఆత్మగౌరవానికిప్రతీకగా ప్రారంభమై అనేక ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించిన పార్టీ ఇంతగా నీరసించిపోవడానికికారణాలేమిటి? అధినాయకుడు చంద్రబాబునాయుడు ధోరణే. ఆయన ఇంకా వందిమాగధుల చుట్టూ ఉన్నారు. తెలుగుదేశంపార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు.పార్టీ గాడి తప్పుతోందని హెచ్చరించే, మంచిదారి చూపే నాయకుడు ఆ పార్టీలో లేరు.ఒకవేళ ఎవరైనా మంచి మాట చెబితే చంద్రబాబునాయుడు నెగిటివ్‌గా తీసుకుంటారన్న భయం ఉంది.ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముకగా ఉండేవారు.మండలాల వ్యవస్ధ ప్రవేశపెట్టిబిసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంవల్ల తొలిసారిగా బిసిలకు మండల స్ధాయిలోఅధికారం రుచి తగిలింది. దానితో వారు తెలుగుదేశంనుతమ సొంత పార్టీగా అభిమానించారు. ఆప్రభావం టిడిపిపై చాలా కాలం ఉంది. 1989లో ఎన్టీఆర్‌నియంతృత్వ ధోరణి, వంగవీటి మోహనరంగా హత్య ప్రభావం వల్లబలహీన వర్గాలు, కాపులు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. ఎన్టీఆర్ పరాజయంచూసిన ఏకైక ఎన్నికలవి. అయితేనేంమరో ఐదేళ్ళకే బలహీనవర్గాలన్నిటినీ తనవైపుతిప్పుకోవడంలో ఆయన సఫలమై 1999ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు.
ఎన్టీఆర్‌నుగద్దె దించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అంటే ఆ పార్టీ వారిలో భయం ఉందికానీ భక్తి లేకుండా పోయింది. ఆయనమీడియా శావీగా మారి నేల విడిచి సాము చేశారు.ప్రచారం పిచ్చిలో పడి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.అక్కడే ఆయన పప్పులో కాలు వేశారు.ఆయనకు అతర్జాతీయంగా పేరు వస్తున్నకొద్దీ సామాన్య ప్రజలు ఆయనకు దూరం కాసాగారు. ఇదిమనది కాని మరోప్రభుత్వమని వారు అనుకున్నారు. ఫలితంగా2004 ఎన్నికల్లో టిడిపి దారుణ పరాజయం చవిచూసింది. శ్రీకాకుళం నుంచి శ్రీకాళ హస్తివరకు, ఆదిలాబాద్ నుంచి చిత్తూరువరకు జనమంతా ఒక చోట చేరి తీర్మానంచేసినట్టుగా ఆయన పార్టీని ఓడించారు. ఈపదిహేడు నెలల్లో చంద్రబాబు నాయుడిలోపెద్ద మార్పు రాలేదు. అదే మీడియాపిచ్చి, అదే సోకాల్డ్ మేధావుల కంపెనీ, వందిమాగధుల పొగడ్తల మధ్య ఆయనకాలం గడుపుతున్నారు. రోడ్‌షోలలో తనకుకన్పించిన ఆ వంద మందిని సామాన్యప్రజలుగా ఆయన భ్రమ పడ్డారు. మీడియాకూడా ఆయన భ్రమలను బలపరిచింది. తొందరపడిఒక కోయిల.. అన్న చందంగా ఆయన ప్రచారాన్ని అగ్రెసివ్‌గానడిపారు. దానితోసామన్యుల్లో ఏవగింపు కలిగింది. కాంగ్రెస్‌ప్రభుత్వ తప్పిదాలను ఎండ గట్టడానికిఆయన మరో ఏడాది ఆగి ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.చంద్రబాబు నాయుడు తన పార్టీనిపటిష్టపరుచుకోడానికి పార్టీలో అంతర్గతప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తే చాలు.












Click it and Unblock the Notifications
