టిఆర్‌ఎస్‌-రియల్‌ఎస్టేట్‌

హైదరాబాద్‌:శాంతిభద్రతలు, ప్రభుత్వ పతనాలు,ప్రకృతి వైపరీత్యాలు స్టాక్‌ మార్కెట్‌లోసెన్సెక్స్‌ హెచ్చుతగ్గులను ప్రభావితం చేస్తాయన్నది తెలిసిందే. అదే ఫక్కీలోహైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరునగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ ధరలను తెలంగాణ రాష్ట్రసమితిపరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి.టిఆర్‌ఎస్‌ నాయకుడు సంతోష్‌రెడ్డి ఆ పార్టీ అగ్రనాయకత్వంపై తిరుగుబాటుచేసినప్పుడు మూడు నాలుగురోజుల్లోనేహైదరాబాద్‌లో ఇళ్ళస్ధలాలు, ఫాంహౌస్‌లరేట్లు గణనీయంగా పెరిగాయి. రాజకీయపరిణామాల కారణంగా రోజువారీప్రాతిపదికన రియల్‌ ఎస్టేట్‌ ధరలుప్రభావితం కావడం బహుశా ఇదేప్రధమం. హైదరాబాద్‌లో ధరలుఅప్‌ట్రెండ్‌లో ఉన్న రోజుల్లో వైజాగ్‌,విజయవాడ, గుంటూరు నగరాల్లోతగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకతెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశానికి ఈ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ధరలకుప్రత్యక్ష సంబంధం ఏర్పడింది.

ఏడాదిన్నరక్రితంరాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశంచోటు చేసుకోవడంతో హైదరాబాద్‌చుట్టుపక్కల రియల్‌ఎస్టేట్‌ ధరలు బాగాపడిపోయాయి. అదే సమయంలో విజయవాడ,గుంటూరు, వైజాగ్‌లలో ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లోకార్యకలాపాలను ఆపివేసి చాలా మందిరియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆంధ్రాకు, బెంగుళూరుకు తరలిపోయారు.గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర రాజధానిఏర్పాటవుతుందని వదంతులురావడంతో అక్కడి పొలాలకుమహర్దశ పట్టింది. తెలంగాణరాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్‌అధిష్టానవర్గం ఎటువంటి హామీ ఇవ్వలేదని, రెండో ఎస్సార్సీ ఆవిషయాన్నిపరిశీలిస్తుందని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి స్పష్టంగా చెప్పినతర్వాత మళ్ళీ హైదరాబాద్‌లోరియల్‌ ఎస్టేట్‌ రంగం బాగా పుంజుకుంది.ఇటీవల టిఆర్‌ఎస్‌లో సంక్షోభంఏర్పడడంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలుఆల్‌టైం హైకి చేరుకున్నాయి.పత్రికల్లోని రియల్‌ ఎస్టేట్‌ క్లాసిఫైడ్‌ యాడ్స్‌లోధరలను కూడా ప్రస్తావిస్తున్నారు. వీటినిబట్టి చూస్తేప్రముఖ ఐటీ కంపెనీలు, ఐటీ పార్కులు గలగచ్చిబౌలి, నానక్‌రామ్‌గుడా, నల్లగండ్ల,షేక్‌పేట, మాదాపూర్‌, కొండాపూర్‌, హఫీజ్‌పేట ప్రాంతాల్లో ప్లాట్ల ధరలు నాలుగు నెలల్లోనే రెట్టింపైనట్టు తెలుస్తోంది. ఆతర్వాత అధికంగా డిమాండ్‌ ఉన్నప్రాంతం అంతర్జాతీయ విమానాశ్రయంవస్తున్న షంషాబాద్‌. ఇక్కడ ధనికులుఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు.

షేర్‌మార్కెట్లోలాగానే కొందరు ప్లాట్ల, రహదారులపక్కన ఉన్న వ్యవసాయ భూముల ట్రేడింగ్‌ప్రారంభించారు. కొంత అడ్వాన్సుఇచ్చి అగ్రిమెంట్‌ చేసుకుని కొద్దిగా ధరపెరిగిన తర్వాత థర్డ్‌ పార్టీకిఅమ్ముతున్నారు. బ్యాంకులు ఇస్తున్నవడ్డీ తక్కువగా ఉండడం , చాలావ్యాపారాలు డల్‌గా ఉండడంతో పెట్టుబడులుపెద్ద ఎత్తున రియల్‌ఎస్టేట్‌రంగంలోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లోధరలు బాగా పెరగడంతోమధ్యతరగతి వారు కూడాఉన్నపళంగా కోటీశ్వరులు అవుతున్నారు. ఈబూమ్‌ వచ్చే అసెంబ్లీఎన్నికల వరకు అంటే సుమారు మూడేళ్ళు ఉంటుందని ఈ రంగంలోనినిపుణులఅంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+