హీరోల భక్తిమార్గం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 10-01-2006
హైదరాబాద్:చిరంజీవితో సహా మన సినిమా హీరోలు భక్తిమార్గం పట్టారు. జై చిరంజీవ సినిమావిడుదలకు ముందేకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజలు చేయాలనిభావించిన చిరంజీవి దానిని వాయిదా వేసుకుని ఇప్పుడుమానస సరోవర్ (టిబెట్) యాత్రకువెళ్ళాలను కుంటున్నారు. మానస సరోవర్‌యాత్ర అత్యంత క్లిష్టమైనది. జీపులుకొంత దూరం వరకే వెళ్తాయి.కాలినడకన కొంత, కొండ గాడిదలమీద కూర్చుని కొంత దూరం ప్రయాణించవలసి ఉంటుంది.చిరంజీవి 21 రోజుల పాటు ఈ యాత్ర చేయనున్నట్టుతెలుస్తోంది.
ప్రస్తుతంఅన్నవరం షూటింగ్‌లో ఉన్నపవన్ కళ్యాణ్ డిసెంబర్ 26న అకస్మాత్తుగా తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అమితాబ్ బచ్చన్‌కూడా అదేరోజు కుటుంబ సమేతంగాతిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. బెల్లంకొండ సురేష్ గొడవ తర్వాతబాలకృష్ణ కాళహస్తి వెళ్ళి సర్పదోషపూజలు చేసుకున్నాడు. ఇటీవలమహేష్‌బాబు కూడా కాళహస్తిలోప్రత్యేక పూజలు చేసి వచ్చారు. తాను ఆస్తికుడినోనాస్తికుడినో చెప్పలేననిమొదట్లో చెప్పుకున్న నాగార్జునలోశ్రీరామదాసు షూటింగ్‌సందర్భంగా పెద్ద మార్పు వచ్చినట్టుచెబుతున్నారు. అన్నమయ్య షూటింగ్‌సమయంలో తన అలవాట్లను మార్చుకోనినాగార్జున శ్రీరామదాసు షూటింగ్ సమయంలోఅత్యంత నిష్టగా ఉంటున్నట్టు చెబుతున్నారు.షూటింగ్‌కు వెళ్ళే ముందు ఆయన రామకోటిరాస్తున్నారు. ఆయనతో పాటు యూనిట్‌సభ్యులంతా రామకోటి రాస్తున్నట్టుసమాచారం. చిరంజీవి తమ్ముడు నాగబాబుకు మొదటినుంచీ భక్తి ఎక్కువ. ఆయన యోగా,సిద్ధ వంటివి చేస్తుంటారు.
వెంకటేష్‌రమణ మహర్షి భక్తుడు. రమణఫిలాసఫీని ఆయనవంటపట్టించుకున్నారు. నిన్ను నీవు తెలుసుకో అన్న రమణ మహర్షిప్రవచనం తనకు నచ్చిందనిఆయన అనేక సందర్భాల్లోచెప్పుకున్నారు. వెంకటేష్‌సోదరుడు సురేష్ బాబు ప్రతిసంవత్సరం శబరిమలై యాత్రకువెళ్తుంటారు. తననుతాను నాస్తికుడిగా అభివర్ణించుకున్నఅక్కినేని నాగేశ్వరరావు భక్తి మార్గంలో పడిందీలేనిదీ తెలియడం లేదు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
