దసరా పండుగవేడి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 06-10-2005
హైదరాబాద్:రాష్ట్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలజోరు ఊపందుకుంది. వినాయకుడి విగ్రహాలకు పూజలుచేసినట్టే నగరంలోనికాలనీల్లో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.బట్టలు, నగలు, గృహోపకరణాలవ్యాపారం జోరుగా సాగుతోంది. డ్రైసీజన్‌లో ఆరునెలల పాటు అమ్మితే వచ్చే ఆదాయం ఈ ఒక్క అక్టోబర్‌లోవస్తుందని వ్యాపారులు విశ్వాసంతో ఉన్నారు.మూడుపండుగలు -దసరా, దీపావళి,రంజాన్- వచ్చిన ఈ అక్టోబర్‌బిజినెస్‌కు లక్కీ మాసం. పండుగలంటే గ్రీటింగ్ కార్డ్సు,స్వీట్లు, బొకేలుగా మారిపోయి వ్యాపార విలువలే పైచేయి అవుతున్నాయి. దసరా పండుగలవిశిష్టతలను, తెలుగు సంస్కృతీసంప్రదాయాలను వివరించేందుకుమన రాష్ట్ర సాంస్కృతిక శాఖ పబ్లిక్‌గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో దసరా ఉత్సవాలనునిర్వహిస్తోంది.తొమ్మిదిరోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
నవరాత్రులలోఅమ్మవారు రోజుకో రూపంలో దర్శనమివ్వడానికి కారణాలనుపండితులు వివరిస్తున్నారు. బతుకమ్మఉత్సవాలను ప్రదర్శిస్తూపల్లెవాతావరణాన్నిలలితకళాతోరణంలో ఆవిష్కరించారు.పండుగ అంటే ఒక రోజు సెలవుగా మారిపోయిననగరవాసుల్లో సంస్కృతీసంప్రదాయాలపై అవగాహనకలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్టురాష్ట్ర సాంస్కృతిక మండలిఅధ్యక్షుడు ధర్మవరపుసుబ్రమణ్యం చెప్పారు. వచ్చే సంక్రాంతి,ఉగాది ఉత్సవాలను త్వరలోనే ఒంగోలు,కడప, వరంగల్ వంటి పట్టణాల్లో నిర్వహించాలని సాంస్కృతిక శాఖయోచిస్తోంది.
దసరా-దీపావళి-రంజాన్‌పండుగల సందర్భంగా అక్టోబర్ నెలలోఆమెరికా, గల్ఫ్, బ్రిటన్ దేశాలనుంచి మనరాష్ట్రానికి ఇరవై కోట్ల రూపాయలు బట్వాడాఅవుతాయని పోస్టల్ శాఖ అంచనా వేసింది. పోస్టల్‌శాఖకు అనుబంధంగా ఉన్నవెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్‌ద్వారా ఎన్నారైలు తమఆత్మీయులకు, బంధుమిత్రులకు నగదుకానుకలు పంపుతున్నారని తపాలా శాఖఅధికారులు చెప్పారు. నగదు బట్వాడాల రద్దీని తట్టుకునేందుకు ఆబిడ్స్,చార్మినార్, సికింద్రాబాద్‌లలోని ప్రధాన పోస్టాఫీసులు అక్టోబర్ 3నుంచి రోజుకి 24 గంటలు పనిచేస్తున్నాయి.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
