బుచ్చయ్య చౌదరి ఆంధ్ర గానం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 09-12-2005

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా ఆంధ్రోద్యమాన్ని తెరమీదకు తీసుకొచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి రంగం సిద్ధం చేస్తున్నారు. తాము ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోరడం లేదని, తమ ప్రాంత వెనకబాటు తనాన్ని రూపుమాపేందుకు, సత్వర పారిశ్రామికీకరణకోసమే ఈ పోరాటమని ఆయన చెబుతున్నారు. రాజకీయ పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ఆంధ్రప్రాంత అభివద్ధి కోసం జరగనున్న ఉద్యమానికి ఆంధ్ర సంక్షేమ పరిషత్‌ అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బుచ్చయ్యచౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. పరిషత్‌ ఏర్పాటుకు గల కారణాలను ఆయన వివరించారు. అయితే తాము ఇతర ప్రాంతాల అభివద్ధికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రావతరణ జరిగిన నాటినుంచి నేటి వరకు ఆంధ్రప్రాంతానికి చెప్పుకోతగ్గ పరిశ్రమలు రాలేదని, విశాఖ ఉక్కు కర్మాగారం మినహా మరే పరిశ్రమ ఇక్కడ స్ధాపనకు నోచుకోలేదని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వివరించారు. అనంతపురం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులు ఆంధ్రప్రాంతంలోని పల్లెలను పట్టిపీడిస్తున్నాయని, ఇప్పటికీ రైతాంగం, కూలీలు పొట్టచేతపట్టుకొని బతుకుదెరువుకోసం రాష్ట్రరాజధానికి వలసవస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

జీవనం కోసం, ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తున్నవారు వివిధ వర్గాలనుంచి అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారని, ఇంకా ఎంతకాలం ఇలాంటివి ఎదుర్కోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రాంతానికి గత 50 ఏళ్లకాలంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు దక్కలేదని ఆయన ఆరోపించారు. కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రాంత అభివద్ధికోసం రాజకీయ పార్టీల్లోనూ చిత్తశుద్ధిలోపించిందని, ఈ విషయంలో ఒకరి కాళ్లు మరొకరు లాగుతున్నారే తప్ప ప్రాంత సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రాంత అభివృద్ధికోసం ఉద్యమించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా మేధావులు, విద్యార్ధులు, ఎన్‌ఆర్‌ఐలు తమతో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో నెల్లూరు, విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు బుచ్చయ్య చౌదరి తెలిపారు. అనంతరం ఒక వేదికను నిర్ణయించి భారీ సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+