లంచావతారాలు
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 01-06-2005
హైదరాబాద్:దేవాదాయ శాఖ కమిషనర్‌గానిన్నటివరకు పనిచేసి పదవీవిరమణ చేసిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఐ.వెంకటేశ్వర్లు తెగబడి అవినీతికిపాల్పడడం అధికార వర్గాలనునివ్వెరపరిచింది. రిటైరయ్యే ముందుఇంత సాహసం చేయవచ్చా అన్నంతగావెంకటేశ్వర్లు వ్యవహరించారు.ఆలయ భూముల ఆర్బిట్రేషన్ విషయంలోదేవాదాయ శాఖ కమిషనర్‌కు ఉన్నవిశేష అధికారాలను అడ్డం పెట్టుకునివెంకటేశ్వర్లు దేవుళ్ళకేశఠగోపం పెట్టారు. తక్కువధరలకు దేవాదాయ భూములనుప్రైవేటు పార్టీలకు కట్టబెడుతూఉత్తర్వులు జారీ చేశారు.
ఐఎఎఎస్‌అధికారుల విషయంలో ఏ చర్య అయినాముఖ్యమంత్రి తీసుకోవాలి. అందువల్లవెంకటేశ్వర్లును మినహాయించి కిందిఅధికారులను సస్పెండ్ చేశారు.వెంకటేశ్వర్లుపై గత నెలరోజులుగాతీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాప్రభుత్వం పట్టనట్టు ఉండిపోయింది.ఐఎఎస్ అధికారులను పాంపరింగ్ చేయడంఅన్ని ప్రభుత్వాలకు మామూలైపోయింది.ఎన్టీఆర్ హయాంలో మినహా ఈ మధ్యకాలంలోచంద్రబాబు నాయుడు కానీ వైఎస్‌రాజశేఖరరెడ్డి కానీ తీవ్ర ఆరోపణలు ఉన్నఐఎఎస్ అధికారులను సస్పెండ్‌చేయలేదు. మురళీకృష్ణ అనేసీనియర్ ఐఎఎస్ అధికారిని 1995 లో ఎన్టీఆర్‌ముఖ్యమంత్రిగా ఉండగా సస్పెండ్‌చేశారు. వెంకటేశ్వర్లు మీద అంతకంటే తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నా చర్యతీసుకోలేదు.
దేవాదాయశాఖలో అవినీతిని చూసి ఆ శాఖమంత్రి ఎంసత్యనారాయణ రావు అవాక్కయ్యారు.కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఉన్నవిశేషాధికారాలను నిలిపివేయవలసిందిగా ఆయన ఆ శాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ మూర్తిని ఆదేశించారు. అయినాఇద్దరూ ఐఎఎస్ అధికారులే కాబట్టి వారిమధ్య నడిచినట్టుచెబుతున్న లాలూచీకారణంగా మూర్తి మంత్రిని తప్పుదోవపట్టించారు. నిజానికి దేవాదాయ శాఖలోదేవుడి డబ్బు ముట్టుకోవాలంటే గతంలోఅధికారులు, మంత్రులు భయపడేవారు.ఇప్పుడు అనీ మారిపోయాయి. తిరుమలతిరుపతి దేవస్ధానం ఎగ్జిక్యూటివ్‌అధికారిగా వెళ్ళడానికి అవినీతి పరులైనఐఎఎస్ అధికారులు భయపడేవారు. ఆ శాఖతప్ప మరేదైనా ఫర్వాలేదని ఆవెంకన్ననే వేడుకునే వారు.
చంద్రబాబునాయుడు హయాంలో ఐఎఎస్ అధికారుల అవినీతిపరాకాష్టకు చేరుకోగా వైఎస్‌హయాంలో అదే ధోరణి కొనసాగుతోంది.ముఖ్యమంత్రి సన్నిహితులకు డబ్బుముట్టజెప్పి మంచి పోస్టింగులువేయించుకుంటున్న అధికారులు ఆబగాలంచాలు తీసుకుంటున్నారు. ఐఎఎస్ అధికారులకుభయం ఉండాలంటే రిటైరైనా సరే వెంకటేశ్వర్లు వెంట పడి, విజిలెన్స్‌అధికారులతో దర్యాప్తు జరిపించాల్సినఅవసరం ఉంది.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications
