• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నష్టాల తెర

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 22-06-2005

హైదరాబాద్‌:తెలుగు సినిమా పరిశ్రమ ఇంకాసంక్షోభం నుంచి బయటపడలేదు. భారీ బడ్జెట్‌, వేలంవెర్రిపారితోషికాలు, కథలఎంపికలో లోపాల కారణంగా పరిశ్రమకు ఈదుస్ధితి దాపురించింది. కొత్త డైరెక్టర్లుకూడా హీరోలతో సమానంగా ఫీజును డిమాండ్‌చేస్తుండడంతో నిర్మాతలకు పాలుపోవడంలేదు. ఎప్పటికప్పుడుకొత్త ట్యాలెంట్‌ వస్తున్నప్పటికీ ఈవేలం వెర్రి స్టార్‌డమ్‌ మాత్రంపరిశ్రమకు హాని కలిగిస్తోంది. సెకండ్‌ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఒక హీరో తనరెమ్యునరేషన్‌గా టీవీ రైట్లు తీసుకుంటున్నాడు.సినిమా ఓ మోస్తరుగాఉంటే ఇరవై లక్షలు హిట్‌ అయితే యాభైలక్షలువస్తాయి. అతని తాజా సినిమాటీవీ హక్కులను విడుదలైన మొదటిరోజే ప్రసారం చేయడానికి ఒక టీవీఛానల్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేయడంతో ఒక వివాదం తలెత్తింది. ఆడబ్బంతా తనకే రావాలని హీరోపట్టుబడుతున్నాడు. తొండి ఆడడమంటేఇదే.

పవన్‌కళ్యాణ్‌ బాలు, ఎన్టీఆర్‌ నా అల్లుడు,నరసింహుడు, బాలకృష్ణవిజయేంద్రవర్మ, వెంకటేష్‌సుభాష్‌ చంద్రబోస్‌ వంటి సినిమాలుఫ్లాప్‌ కావడంతో పరిశ్రమకువాటిల్లిన నష్టం 150 కోట్లు. త్వరలోవిడుదల కానున్న నాగార్జునసూపర్‌, మహేష్‌ అతడుహిట్‌ అయితే పరిశ్రమకొంతవరకు గట్టెక్కగలుగుతుంది.ఏటా వందకు పైగా తెలుగు ్రస్టెయిట్‌ సినిమాలువిడుదలవుతున్నాయి. మరోపాతికకు పైగా అనువాద చిత్రాలు విడుదలఅవుతున్నాయి. ఇటీవల విడుదలైనచంద్రముఖి అపరిచితుడుతమిళ-తెలుగు అనువాద చిత్రాలుతెలుగులో సూపర్‌ హిట్‌ అయ్యాయి. దీని అర్ధం తమిళంలో మనకంటే ఎక్కువట్యాలెంట్‌ ఉన్నట్టా? అవును. మన కంటేవారికి సృజనాత్మకత, ప్లానింగ్‌ నైపుణ్యంఎక్కువ. చెంగలవెంకటరావు వంటి నిర్మాతలు అక్కడ చాలా తక్కువ.

ఒకమూసలోఇరుక్కుపోయిన జూ ఎన్టీఆర్‌ వెరైటీ కథలకోసం వేచిచూస్తున్నారు. బాలకృష్ణది కూడాదాదాపు అదే పరిస్ధితి. వరుస ఫ్లాప్‌లతోకుంగిపోయిన పవన్‌ కళ్యాణ్‌కుబంగారం మీద భారీ ఆశలున్నాయి. నాగార్జున ఒక్కరేకథల ఎంపికలో ట్రెండీగా వ్యవహరిస్తూ వరుసవిజయాలను సాధిస్తున్నాడు. అనువాద చిత్రాల చట్రంలో ఇరుక్కుపోయిన వెంకటేష్‌సుభాష్‌ చంద్రబోస్‌తో ప్రయోగం చేసి దెబ్బతిన్నాడు. అతను మళ్ళీఅనువాద చిత్రాలకే పరిమితంకాబోతున్నాడు.

ఇకదర్శకుల విషయానికి వస్తే మూడు సినిమాలు హిట్‌ కావడంతో రాజమౌళిరెమ్యూనరేషన్‌ విషయంలో చెట్టెక్కికూర్చున్నాడు. వి. వినాయక్‌, విజయభాస్కర్‌,పూరీ జగన్నాధ్‌, జయంత్‌ వంటి వారిస్టార్‌ డైరెక్టర్ల రేంజిలో ఉన్నారు.అతనొక్కడేతో దర్శకుడిగా పరిచయమైన సురేందర్‌ రెడ్డిరాత్రికి రాత్రి స్టార్‌ డైరెక్టర్‌అయిపోయారు. వీరి రెమ్యూనరేషన్లుచిత్ర వ్యయంలో డిస్‌ ప్రపోర్షనేట్‌గాఉంటున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమనుపట్టి పీడిస్తున్న మరో సమస్య బాలీవుడ్‌భామలు. దక్షిణాది హీరోయిన్లుతక్కువ ఫీజుకు వస్తున్నా భారీగారెమ్యునరేషన్‌లు ఇచ్చి బాలీవుడ్‌ భామలను బతిమలాడుకుంటున్నారుమన నిర్మాతలు. పాటలకు ఫైట్లకు ఫారిన్‌లొకేషన్లు ఎంచుకోవడం మరో జాడ్యం.

అన్నీ చిన్నసినిమాలు వచ్చినంత మాత్రాన సినిమాపరిశ్రమ సురక్షితంగా ఉండదు.పరిశ్రమ ఆరోగ్యకరంగా మనుగడసాగించాలంటే పెద్ద, చిన్న సినిమాలు చక్కటిప్రపోర్షన్‌లో రావాలి. ఒక సినిమా హిట్‌ అయిందంటే నిర్మాతనుంచి థియేటర్‌లోసైకిల్‌ స్టాండ్‌ ఓనర్‌ వరకు అదిపండగే. వేలాది మందికి ఉపాధి కలిగిస్తున్న ఇంత పెద్ద పరిశ్రమసంక్షోభంలో చిక్కుకోవడం రాష్ట్రసర్వతోముఖాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X