జయ (క్రీస్తు)సుధ
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 05-08-2005
జయ (క్రీస్తు)సుధ
హైదరాబాద్:శతకోటి దరిద్రాలకు అనంత కోటిఉపాయాలు అంటారు. మొదటి భర్తకారణంగా ఆస్ధిపాస్తులను కోల్పోయినజయసుధ రెండో భ ర్తనితిన్‌కపూర్‌తో కలిసి హైదరాబాద్‌కుమకాం మార్చారు. జూబిలీహిల్స్‌లో పాతికవేల అద్దెకు ఒక ఇండిపెండెంట్ భవనాన్నిఅద్దెకు తీసుకున్న ఆమె సినిమా, టీవీ రంగాల్లో నిర్మాతగాఅదృష్టాన్ని పరీక్షించుకోదలచుకున్నారు.గత ఎన్నికల్లో తెలుగుదేశం వైపుఉన్న ఆమె బి ఎ రోమన్ ఇన్ రోమ్‌అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపుఆకర్షితురాలైంది. ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి కుటుంబం కూడా క్రిస్టియన్లు కావడంతోజయసుధకుఅక్కడ మంచి విలువ ఉంది.
రెండేళ్ళక్రితం క్రిస్టియన్ మతంపుచ్చుకున్న జయసుధ ఆ మత ప్రచారంలో కీలక పాత్రవహిస్తున్నారు. ఆమె షైన్ డెవలప్‌మెంట్‌ట్రస్టు అనేఒక స్వచ్ఛంద సంస్ధను స్ధాపించి విదేశీవిరాళాలను స్వీకరిస్తున్నారు. సమాజంలోగుర్తింపు ఉన్న వ్యక్తులు క్రిస్టియన్ మతంపుచ్చుకుంటే భారీగా కానుకలుముడతాయన్నది అందరికీ తెలిసిందే.తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నజయసుధ తన బాధలను ఆ ఏసుప్రభువు తప్పమరెవరూపరిష్కరించలేరని తెలుసుకుని మతంమార్చుకున్నారు. హైదరాబాద్ నగరశివారు గ్రామాల్లో ఆమె క్రిస్టియన్ మతాన్నిప్రచారం చేస్తున్నారు. నిరుపేద బాలల చిరునవ్వులోయేసు ప్రభువు ఉన్నాడనిఉపన్యాసమిస్తూ ఆమె గ్రామీణులను ఆకట్టుకుంటున్నారు.
జయసుధఆర్ధిక పరిస్ధితి ప్రస్తుతం టీవీసీరియల్‌కు ఎక్కువ సినిమాకుతక్కువ అన్నట్టు ఉంది. మత ప్రచారంమాట ఎలా ఉన్నా తనకు ఇష్టమైన సినిమారంగంలోకి నిర్మాతగా మళ్ళీప్రవేశించాలని జయసుధ తాపత్రయం.పిల్లల పేరిట ఎప్పుడో వేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లుకూడా అంది రావడంతో ఆమె నిర్మాతగామారబోతున్నారు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications