వెలసినగులాబీ
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 24-04-2005
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్)అధినేత కె. చంద్రశేఖర్ రావుగడ్డు సమస్యను ఎదుర్కుంటున్నారు.పార్టీ వ్యవస్థాపక దినోత్సవంనాడుప్రకటించడానికి, తద్వారా పార్టీక్యాడర్‌కు ఉత్సాహం నింపడానికి ఆయనవద్ద ఏ విధమైన మసాలా లేనట్లేఅనిపిస్తోంది. పార్టీ వ్యవస్థాపకదినోత్సవం ఈ నెల 27వ తేదీనజరగనుంది. ఈ వ్యవస్థాపకదినోత్సవాల ఏర్పాట్లను టి ఆర్‌యస్‌నాయకులు ఎ. నరేంద్ర,మధుసూదనాచారి, తదితరులుఆదివారంనాడు పర్యవేక్షించారు.
ఈకార్యక్రమానికి చంద్రశేఖర్ రావువస్తారని అంటున్నారు. ఈ సమావేశంలోగత నాలుగేళ్ల సానుకూల పరిణామాలనుసమీక్షిస్తామని, భవిష్యత్తుకార్యాచరణనురూపొందించుకుంటామని టి ఆర్‌యస్‌నాయకులంటున్నారు. భవిష్యత్తుకార్యక్రమం ఎలా వుంటుందనేవిషయంపై అప్పుడే చర్చలుప్రారంభమయ్యాయి. రాష్ట్రమంత్రివర్గంలోంచి టి ఆర్‌యస్ బయటకువస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.అయితే వాటిని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డికొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం నుంచిటి ఆర్‌యస్ వైదొలగదనేనమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.వైయస్ నమ్మకమే నిజమయ్యేట్లుంది.టి ఆర్‌యస్ మంత్రుల్లో కొందరువైయస్‌కు అనుకూలమైన వారుఉన్నారు. సంబంధాలుతెంపుకోవాలనుకుంటే టి ఆర్‌యస్‌కొత్త సమస్యలో చిక్కుకోవచ్చు.
పరిస్థితితెలంగాణకు అనుకూలంగా ఉందనేవార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.కానీ అందుకు అనువుగా కదలికలులేవు. ఢిల్లీలో లాబీయింగ్ ద్వారాతెలంగాణను సాధిస్తామని, సోనియా గాంధీతెలంగాణకు అనుకూలంగా ఉన్నారని,తెలంగాణ రాష్ట్రం రేపోమాపోవస్తుందని, వచ్చినట్లేనని ప్రకటిస్తూగత ఏడాది కాలంగా చంద్రశేఖర్ రావుకాలం గడుపుతూ వచ్చారు. అయితేఆయన ఇంకెంతో కాలం అలా చేసేపరిస్థితులు లేవు.
వెనకఎవరున్నా, లేకున్నా సినీనటి విజయశాంతితెలంగాణ కోసం పార్టీ పెట్టడానికి చురుగ్గాఏర్పాట్లు చేసుకుంటుండటం టి ఆర్‌యస్‌కుపచ్చి వెలక్కాయ మింగినట్లయింది. ఆలస్యంఅవుతున్నా కొద్దీ పరిస్థితులు కెసి ఆర్‌కువ్యతిరేకంగా పరిణమించే ప్రమాదంఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే చంద్రశేఖర్‌రావు సోనియాను కలిసినట్లుసమాచారం. తాడోపేడో తేల్చుకోకపోతేచెన్నారెడ్డి సరసన చంద్రశేఖర్‌రావు చేరిపోక తప్పదు. ఈ అవమానాన్నిచం।దశేఖర్ రావు ఒక్కరే కాదు,తెలంగాణ ప్రజలందరూ మోయాల్సిఉంటుంది.
- మామూలై పోయిన మామూళ్ళు!
- తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
- తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ చచ్చుడో
- తారల ప్రభావం నిల్!
- ఉద్వేగ అంశాలు
- తారల ప్రభావం నిల్!
- ఇప్పటికిప్పుడు చెరిసగం
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవి రహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
- కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవి రహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications
