విస్తరణ లోకెసిఆర్‌కు కత్తెర?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 04-11-2005
;?
హైదరాబాద్:ఒకటి రెండు రోజుల్లో కేంద్ర మంత్రివర్గవిస్తరణ జరుగనుంది. ఈ విస్తరణలో మన రాష్ట్రానికి సంబంధించికొన్ని ముఖ్యమైన పరిణామాలుజరుగనున్నాయి. కాంగ్రెస్ ఎంపీలుసుబ్బరామిరెడ్డి, కెస్ రావు, దగ్గుబాటిపురంధరేశ్వరి, వి. హనుమంతరావు, జెడి శీలంమంత్రి పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతకేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిఎస్ జైపాల్‌రెడ్డిని మంత్రి పదవి నుంచితప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించేఅవకాశాలున్నాయి. కేంద్ర టూరిజం శాఖ సహాయమంత్రి రేణుకాచౌదరికి ఉద్వాసన పలికేపక్షంలో పురంధరేశ్వరికి గానీకావూరి సాంబశివరావుకు గానీఅవకాశం లభిస్తుంది.
రాష్ట్రంనుంచి కేంద్రంలో కేబినెట్ మంత్రిగాఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావుశాఖను మార్చేఅవకాశముంది. ప్రస్తుతం కార్మికశాఖను చూస్తున్న ఆయనకు అప్రధాన శాఖఇస్తారని ప్రచారం జరుగుతోంది. మాటిమాటికీ హైదరాబాద్‌వస్తూతన శాఖను పెద్దగా పట్టించుకోనిగ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఎ. నరేంద్రకుకూడా అప్రధాన శాఖ ఇవ్వడమో పూర్తిగా తొలగించడమోజరగవచ్చు. తమకు అప్రధాన శాఖలుకేటాయిస్తే వెంటనే రాజీనామా చేయాలని చంద్రశేఖరరావు,నరేంద్ర యోచిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లోటిఆర్‌ఎస్ పరాజయం చవి చూసినప్పటి నుంచి వీరి పరపతి కేంద్రంలోబాగాతగ్గిపోయింది. వీరిని పొమ్మనకుండా పొగబెట్టాలని కాంగ్రెస్ అగ్రనాయకులపథకం. అందుకు మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణేచక్కటి మార్గమని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గవిస్తరణకు ముందే సోనియాగాంధీనికలుసుకుని తన ప్రతిపాదనలనువిన్నవిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గవిస్తరణపై కూడా వైఎస్ సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌లతో చర్చించే అవకాశముంది.
ఇటీవలికథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
