వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌రావు సాహెబ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 25-11-2005

హైదరాబాద్‌:బీహార్‌, ముంబాయి నేపధ్యంలో సాగినతెలుగు సినిమాల్లో మన హీరోల శౌర్యప్రతాపాలను చూసే ఉంటారు. అంతకంటేగొప్ప హీరోయిజం చూపిన ఒకతెలుగువాడు కెజె రావు. వయసుఅరవై పైనే. ఇటీవల జరిగిన బీహార్‌ అసెంబ్లీఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకసలహాదారుగా ఆయన బీహార్‌ మాఫియాలవెన్ను విరిచి సజావుగా ఎన్నికలు జరిగేలాకృషి చేశారు. ఆయన పేరు బీహార్‌లో,ఢిల్లీలో మార్మోగినా మన తెలుగు మీడియాఆయన గురించి రాసింది చాలా తక్కువ.యుడిసి నుంచి ప్రభుత్వ కార్యదర్శివరకు ఎదిగిన రావు ఆంధ్రప్రదేశ్‌లోపుట్టారు. విధి నిర్వహణ తప్ప ఏదీఆయనకు పట్టదు.

గతపదిహేనేళ్ళుగా బీహార్‌ ఎన్నికల నిర్వహణతోఆయనకు సంబంధం ఉన్నాఈసారి ఆయనకు ఎన్నికల కమిషన్‌ పూర్తిఅధికారాలను స్వేచ్ఛను ఇచ్చింది. ఆయన చేతిలో ఉండేది ఒక సెల్‌ఫోన్‌మాత్రమే.అదే ఆయన ఆయుధం. అంగరక్షకులులేరు. బీహార్‌లో పనిచేసిన అనుభవంతోఆయన అక్కడి బాహుబలులు ఎన్నికల్లో అక్రమాలకుపాల్పడకుండా బహుముఖవ్యూహం అమలు చేశారు. జిల్లాల వారిగాకంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి, కమ్యూనికేషన్‌వ్యవస్ధను పటిష్టం చేయడంతో ఆయన తొలివిజయం సాధించారు. ఎక్కడైనా ఎవరైనా ఎన్నికలనియమావళిని ఉల్లంఘించినట్టు ఒక్క ఫోన్‌కాల్‌ వచ్చినా ఎన్నికల అధికారులు అక్కడవాలిపోయి చేయవలసింది చేసేవారు. కెజెరావు ఇంత పకడ్బందీ వ్యూహంతోఎన్నికల పని మొదలు పెట్టడంతో లాలూప్రసాద్‌ యాదవ్‌కు, కాంగ్రెస్‌ దిగ్గజం దిగ్విజయ్‌ సింగ్‌కునిద్ర పట్టలేదు.రావును మైనారిటీ వ్యతిరేకిగా చిత్రీకరించి, ఆయనపై ఎన్నికల కమిషన్‌కుఫిర్యాదు చేశారు. రావు మీద ఎన్నోప్రశంసలు, విమర్శలు, ఆరోపణలు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయనవిమర్శలకు కుంగిపోకుండా, ప్రశంసలకుపొంగిపోకుండా తన విధిని చిత్తశుద్ధిగా,అంకితభావంతో నిర్వర్తించారు.

బీహార్‌చరిత్రలోనే ఎన్నడూ లేనంతప్రశాంతంగా ఎన్నికల నిర్వహించినరావును జాతీయ మీడియా ఎంతగానోప్రశసించినా ఆయన మౌన గంభీరంగాఉండిపోయారు. నా పని నేను చేశాను.అందులో గొప్పతనం ఏమీ లేదు అని ఆన్నారు.ఆయన కృషి ఫలితంగా కొన్ని దళితవాడల ప్రజలు మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు వీరిని లోకల్‌ లార్డ్స్‌ ఓటు వేయనిచ్చేవారుకాదు. లాలూ ప్రసాద్‌కు కూడా రావు అంటేభయమన్న విషయం బీహార్‌ సామాన్యులకు తెలిసిపోయింది.వారు ఆయనను చూడకపోయినా ఆయన గురించిబాగా విన్నారు. ఎన్నికల సమయంలోహెలికాప్టర్‌లో, కాలినడకన, మోటారుసైకిల్‌ వెనుకకూర్చునిఆయన బీహార్‌ అంతా కలియతిరిగారు.పెద్ద నాయకులన్న వారి మీద కూడా నియమావళిని ఉల్లంఘిస్తేకేసులుపెట్టించారు. ఒక తెలుగు అధికారికి జాతీయస్ధాయిలో ఇంత పేరు రావడంతెలుగువారందరూ గర్వించాల్సినవిషయం.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X