ఖుష్‌బూదుమారం


చెన్నై:తెలుగు, తమిళ నటి ఖుష్‌బూ ఇటీవలచేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంచెలరేగుతోంది. వివాహానికి ముందులైంగిక సంబంధాలపై ఆమె చేసినవ్యాఖ్యలపై కొన్ని రాజకీయ పార్టీలు నిప్పులుచెరుగుతున్నాయి. ఖుష్‌బూ వ్యాఖ్యలుతమిళనాడులోని రాజకీయ పార్టీలకు, సినీరంగానికి మధ్య వివాదానికి తెరతీశాయి. సినిమా రంగం నుంచి కూడా ఆమెవ్యాఖ్యలకు వ్యతిరేకతవ్యక్తమవుతోంది. దళిత పాంథర్స్‌పార్టీ కార్యకర్తలు దక్షిణ భారతకళాకారుల సంఘం కార్యాలయంపై దాడిచేశారు. కార్యాలయంపైకి చెప్పులు,చీపుర్లు విసిరారు. ఖుష్‌బూ క్షమాపణచెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడంతప్పేమీ కాదని, కాకపోతే గర్భంరాకుండా జాగ్రత్త పడాలని ఆమె అంది.విద్యావంతులైన పురుషులెవరూతమకు కాబోయే భార్య కన్యత్వంపైఆశలు పెట్టుకోరని ఆమె అంది. దీంతోతమిళనాడులో తీవ్ర ఆగ్రహంవ్యక్తమైంది.
ఇదిలావుంటే,దాదాపు వంద మంది క్యాజువల్ ఆర్టీస్టులుగత రాత్రి సంఘం కార్యాలయంలోసమావేశమై దళిత పాంథర్స్‌కార్యకర్తలపై చర్య తీసుకోవాలనిడిమాండ్ చేశారు. లైంగిక వ్యాధులప్రమాదం గురించి హెచ్చరిక చేయడానికేఖుష్‌బూ ఆ విధంగా మాట్లాడిందని వారువాదిస్తున్నారు.
ఖుష్‌బూప్రకటన తమిళ తమిళ సంస్కృతికి,నైతికతకు విరుద్ధమైందనిదళిత పాంథర్స్ కార్యకర్తలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేఅభిప్రాయాన్ని తమిళ సినీరంగంలోనికొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈవిధమైన వివాదం చెలరేగడంఇటీవలి కాలంలో ఇది రెండోది. కేవలం డబ్బులకోసం మాత్రమే నటించేవారువేశ్యలతో సమానమని దర్శకనిర్మాత థాంకర్ బచన్ చేసిన వ్యాఖ్యఇటీవల తీవ్ర వివాదానికి దారి తీసింది. సినీపెద్దల ముందు ఆయన అందుకుక్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ నిర్మాతవ్యాఖ్యకు తీవ్రంగా నిరసన వ్యక్తంచేసిన మహిళా నటుల్లో ఖుష్‌బూ కూడా ఉంది.అంతేకాకుండా ఆయన వ్యక్గిగతక్షమాపణకు ఆమె ఏ మాత్రం సంతప్తిచెందలేదు.
దుమారంతీవ్రం కావడంతో తమిళనాడుమహిళలకు ఖుష్‌బూ క్షమాపణ చెప్పింది.తన ఉద్దేశం అది కాదనిసమర్థించుకునే ప్రయత్నం చేసింది.ఇదిలావుంటే, ఆమె పరువు నష్టం దావాదాఖలైంది.
ఇటీవలి కథనాలు హోంపేజి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!