లోక్‌సత్తాప్రయోగం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 06-01-2006
హైదరాబాద్:వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో లోక్ సత్తాతన అభ్యర్ధులను నిలబెట్టబోతోంది.కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతోవిసిగిపోయి, రాజకీయాల్లో కొత్తదనంకోరుకుంటున్న వారికి ఇది శుభవార్తే.రాజకీయాల్లో విలువల కోసం లోక్‌సత్తా చాలాసంవత్సరాలుగా కృషి చేస్తోంది.లోక్‌సత్తాను స్వచ్ఛంద సంస్ధగాఉంచేస్తే దాని మనుగడ కష్టమన్నఅభిప్రాయాన్ని ఇప్పటికే నిపుణులు అంచనావేశారు. లోక్‌సత్తా ఒక రాజకీయ శక్తిగామారడం ఇప్పుడున్నపరిస్ధితుల్లో హర్షణీయమే.
ఐఎఎస్‌కు రాజీనామాచేసి మెరుగైన సమాజ నిర్మాణం కోసండాక్టర్ జయప్రకాష్ నారాయణలోక్‌సత్తాను స్ధాపించారు. ఈ సంస్ధకురాష్ట్ర వ్యాప్తంగా వేలాది కార్యకర్తలుఉన్నారు. రాజకీయాల్లో నేరచరితులుఉండకూడదని, ధన బలం తగ్గాలని, అవినీతినినిర్మూలించాలని లోక్‌సత్తా లక్ష్యాల్లో కొన్ని. లోక్‌సత్తాకు రాష్ట్రంలో కంటేవిదేశాల్లో శ్రేయోభిలాషులు, దాతలు పెద్దసంఖ్యలో ఉన్నారు. జయప్రకాష్ నారాయణకు ఉన్న క్లీన్ ఇమేజ్‌లోక్‌సత్తా అభర్ధులకు ప్లస్ పాయింట్‌అవుతుంది.
తెలుగుదేశంపార్టీ బలహీన పడుతున్నందువల్ల ఒకవర్గం వారు లోక్‌సత్తాను సమాంతర రాజకీయశక్తిగా మార్చుతున్నారన్న విమర్శ ఒకటివినిపిస్తోంది. ఇటువంటి విమర్శలనుతిప్పికొట్టాలంటే బిసి, ఎస్‌సి, ఎస్‌టిఅభ్యర్ధులను పెద్ద సంఖ్యలో నిలబెట్టవలసిఉంటుంది. లోక్‌సత్తాకు కొన్ని మీడియా గ్రూపులప్రోత్సాహం కూడా ఉంటుంది కాబట్టి రాజకీయశక్తిగా ఎదగడానికి ఎంతో కాలంపట్టకపోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్నిస్ధానాలకు పోటీ చేసే శక్తిని లోక్ సత్తాసమకూర్చుకుంటుందని ఆశించవచ్చు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
