మాస్టర్‌ ప్లాన్‌!

Chandrababu Naiduహైదరాబాద్‌:కేంద్రంలో మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్న తరుణంలోనేఆ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ, మాజీ మంత్రినల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిభువనేశ్వరికి రాష్ట్ర పార్టీ పగ్గాలుఅప్పగించి. మీరు ఢిల్లీలో చక్రం తిప్పండి అని చంద్రబాబునాయుడికి లేఖ రాయడంవిశేషం. ఆ లేఖ ప్రతులను ఆయన పత్రికలకువిడుదల చేసి తాను నెల్లూరులోనే ఉండిపోయారు.ప్రసన్నకుమార్‌ రెడ్డికి చంద్రబాబు నాయుడంటే పడడంలేదని ఆ లేఖను చూస్తే పైకి అన్పిస్తుంది. కానీ అదివాస్తవంకాదని, చంద్రబాబు నాయుడు, ఆయన శ్రేయోభిలాషులుప్రసన్నకుమార్‌ రెడ్డి ద్వారా తమపథకానికి సంబంధించిన ఫీలర్‌వదిలారని తెలుస్తోంది.

47మందిఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోఉండి చేయగలిగింది ఏమీ లేదని, ప్రజల మూడ్‌కూడా ఇప్పట్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగామారే పరిస్ధితి లేదని తెలుసుకున్నతెలుగుదేశం మేధావులు ఈ పథకంరచించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో తృతీయఫ్రంట్‌ ఏర్పాటుకు ఇప్పుడు అవకాశాలు బాగాఉన్నందున అక్కడ చంద్రబాబు నాయుడుబాగా రాణించగలరని వీరి అభిప్రాయం. తృతీయఫ్రంట్‌ కన్వీనర్‌గా కేంద్రంలో ఉంటే చంద్రబాబునాయుడు సిబిఐ వంటి దర్యాప్తు సంస్ధలవేధింపులనుంచి తప్పించుకోవచ్చని కూడా వీరిఆలోచన. రాష్ట్రంలో భువనేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే,ఆమె ఎన్టీఆర్‌ ముద్దుల కుమార్తె కాబట్టిటిడిపిని బలోపేతం చేయవచ్చని చంద్రబాబునాయుడు శ్రేయోభిలాషుల మాస్టర్‌ ప్లాన్‌.

ఎన్టీఆర్‌ బతికున్నంతకాలం కాంగ్రెస్‌ వారసత్వరాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్‌లోవారసులను కుక్కమూతి పిందెలు అనిఆయన ఎద్దేవా చేశేవారు. మరి ఇప్పుడుఅదే సంప్రదాయంలో భవనేశ్వరిటిడిపి పగ్గాలు చేపట్టడం ఆయన ఆత్మకుశాంతి కలిగించే విషయమా? ఒకవేళ చంద్రబాబునాయుడి అవసరం కేంద్రంలో ఉన్నంతమాత్రాన ఆయన టిడిపి అధ్యక్షుడిగాకొనసాగకూడదని ఎక్కడైనా రాసి ఉందా?ఒకవేళ ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టికేంద్రీకరించాలనుకుంటే ఇక్కడ టిడిపిలోఆయన స్ధానాన్ని భర్తీ చేసే నాయకులేలేరా? కాంగ్రెస్‌ ప్రభంజనంలో కూడాగెలుస్తూ ఇప్పటికి ఐదు, ఆరు సార్లుఎమ్మెల్యేలు అయిన నాయకులు టిడిపిలోఉన్నారు. ఎన్టీఆర్‌ చేత చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ మెప్పు పొందినసీనియర్‌ నాయకులు ఆ పార్టీలో ఉన్నారు.మళ్ళీ ఈ వారసత్వం ఏమిటి? మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా?

ఇటీవలికథనాలు

  • చక్రబంధంలో చంద్రబాబు
  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+