తమిళసిన్మాలు నేర్పిన పాఠాలు
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 31-12-2005
హైదరాబాద్:తమిళ సినిమాలకు, తెలుగు సినిమాలకువివిధ కోణాల్లో ఉన్న తేడాలను 2005సంవత్సరం తేటతెల్లం చేసింది.సృజనాత్మకత, కొత్తదనంలోపించడంతో అనేక తెలుగు భారీ చిత్రాలు బాక్సాఫీసువద్ద బోల్తా పడ్డాయి.నువ్వు వస్తానంటే నేనొద్దంటానా,సంక్రాంతి, అతడు అతనొక్కడేభద్ర బన్ని ఛత్రపతి, మాస్,సినిమాలు మాత్రమే హిట్‌కోవలోకి వచ్చాయి. మొత్తం 120కి పైగాసినిమాలు విడుదల కాగా అందులో ఎనిమిదితెలుగు సినిమాలు మాత్రమే హిట్ కాగాఐదు తమిళ డబ్బింగ్ చిత్రాలు భారీ వసూళ్ళుసాధించాయి. అవి చంద్రముఖి,అపరిచితుడు, గజిని, ప్రేమిస్తే,మన్మధ చిత్రాలు తెలుగుప్రేక్షకులను కొత్తదనంలోఓలలాడించాయి.
ఘోరంగా ఫ్లాప్‌అయిన భారీ తెలుగు సినిమాలు పవన్‌కళ్యాణ్ బాలు, ఎన్టీఆర్ నా అల్లుడు,ప్రభాస్-కృష్ణవంశీల చక్రం,వెంకటేష్-రాఘవేంద్రరావులసుభాష్ చంద్ర బోస్, ఎన్టీఆర్‌నరసింహుడు, చిరంజీవిఅందరివాడు, అల్లరి బుల్లోడు, బాలకృష్ణ అల్లరి పిడుగు, రవితేజభగీరథ, చిరంజీవి జై చిరంజీవ.తెలుగు హీరోలలో మహేష్ బాబు విజయపథంలో అందరికంటేముందున్నాడు. అలాగే హీరోయిన్లలో త్రిషవిజయవిహారం చేసింది. ఆమెను నిర్మాతలుఅదృష్ట సంకేతంగా చూస్తుండడంతోఆమె పారితోషికం కోటి రూపాయలకు చేరినట్టు తెలుస్తోంది. జ్యోతిక,చార్మి, జెనీలియా, శ్రీయలకు కొన్ని విజయాలు కొన్ని పరాజయాలుఉన్నాయి.
ఫర్వాలేదనిపించినచిత్రాలు: ఆంధ్రుడు, అదిరిందయ్యా చంద్రం, ఎ ఫిల్మ్‌బై అరవింద్‌ఒక్కడే, అమ్మ మీద ఒట్టు,మహానంది, అనుకోకుండా ఒక రోజు,హంగామా మొదలైనవి. శేఖర్‌కమ్ముల, చంద్రసిద్ధార్ధ, చంద్రశేఖర్‌ఏలేటి, శేఖర్ సూరి వంటిదర్శకులపై తెలుగు సినిమా పరిశ్రమఆశలు పెట్టుకుంది. రామ్‌గోపాల్ వర్మనిర్మాతగా తెలుగు పరిశ్రమకుతిరిగిరావడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది. తమిళ పరిశ్రమనుంచి తెలుగు సినిమా కొన్ని మంచి పాఠాలు నేర్చుకుంటే 2006 ఆశాజనకంగాఉండవచ్చు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
