వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ గిట్టని దేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 05-10-2005

What is the true tribute for Gandhiji?హైదరాబాద్‌:రక్త మాంసాలు నిండిన ఇటువంటి ఒకమనిషి ఈ భూమి మీదే నడిచాడంటే ముందు తరాలవారు నమ్మడంకష్టం అని విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ఒక మనిషిని గురించి వ్యాఖ్యానించారు. ఆ మనిషిమహాత్మాగాంధీ. ఐన్‌స్టీన్‌ ఊహ నిజమే అయింది. గాంధీజీ అంటే గతమని ఇప్పటితరం భావిస్తోంది. గాంధీజీ భావజాలం నేటిసమజానికి పనికిరాదని చాలా మందిఅభిప్రాయం. ఇటీవల గాంధీజీ 136 వ జయంతిసందర్భంగా మన తెలుగు ఎడిటర్లుసంపాదకీయాల తద్దినం పెట్టారు.గాంధీజీ గొప్పవాడే కానీ అందరూ నూలు నేయాలని,భారీ పరిశ్రమలు ఉండరాదనిఆయన చెప్పిన విషయాలను ఆచరించలేమంటూ ఒక మహాసంపాదకుడు కాలమ్‌ రాశాడు. వ్యక్తుల గురించి రాసేటప్పుడుమంచి వాడేకానీ అంటూ ఒక ఫిటింగ్‌ పెట్టడం ఫ్యాషనై పోయింది.

సత్యం,అహింస గాంధీకి ముందు ఉన్నాయి, ఆతర్వాత ఉన్నాయి. మరిమహాత్ముడికి ప్రపంచవ్యాప్తంగా అంతగుర్తింపు ఎందుకు వచ్చింది. తాను నమ్మిన దాన్ని, ప్రవచించిన దాన్ని ఆయనఆచరించి చూపాడు. కోట్లాది ప్రజల నీరాజనాలుపొందినా, బకింగ్‌హం ప్యాలెస్‌ ఆతిధ్యంపొందినా ఆయన మరుగుదొడ్లుకడగడం మానుకోలేదు. ఆ పనినిఆయన మరణించేవరకూ చేస్తూనేఉన్నాడు. గాంధీజీ చరఖా ఒక సింబాలిజమ్‌ మాత్రమే. స్వావలంబనకు అది చిహ్నం.ప్రతి ఇంట్లో చరఖా పెట్టుకుని ఎవరు నేసినబట్టను వారే ధరించాలని ఆయనశాసించలేదే. విదేశీ వస్తువులను బహిష్కరించడంనాటి సత్యాగ్రహం ఉద్యమంలో ఒక భాగం. దానిని్రస్టెస్‌ చేసేందుకే ఆయన చరఖాను ప్రచారంలోకి తెచ్చారు. అభివృద్ధికి,సైన్సుకు గాంధీజీ వ్యతిరేకం కాదు.సైన్సు పరిశోధనలు గ్రామీణ నిరుపేదలజీవన ప్రమాణాలను పెంచేవిగా ఉండాలనిఆయన ఆకాంక్షించారు. ఆయన కాలంలోనేప్రముఖ మేధావులతో శాస్త్రవేత్తలతోసైన్స్‌ ఫర్‌ ది పీపుల్‌ అనే కమిటీనిఆయన స్వయంగా ఏర్పాటు చేశారు.

ప్రపంచశాంతి,అహింస, సత్యం వంటి గాంధీ మార్గాలుగతం కావని, వర్తమానం , భవిష్యత్తుఅవేనని అనేక దేశాలుఆలస్యంగా గ్రహిస్తుంటే, మనదేశంలోగాంధీ విగ్రహాల్లో ఘనీభవించిపోవడం ఎంతబాధాకరం. ఏటా గాంధీ విగ్రహాలకు దండలువేసి చేతులు దులుపుకుంటున్నాం. ఆయనతెచ్చి పెట్టిన స్వాతంత్య్రం నుంచిఅధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్‌ నాయకులదృష్టిలో ఆయనొక ఫకీరు.ప్రపంచ ప్రఖ్యాత కంప్యూటర్స్‌ సంస్ధఆపిల్‌ థింక్‌ డిఫరెంట్‌ యాడ్‌క్యాంపెయిన్‌లో గాంధీజీ, ఆయన రాట్నం ఒకరోల్‌ మోడల్‌. ఆ విషయం మనకాంగ్రెస్‌ పాలకులకు, మన విదూషకసంపాదకులకు ఎంతమందికి తెలుసు?గాంధీ సామాజిక ఆర్ధిక సిద్ధాంతాలపైవిదేశాల్లో స్టడీ సెంటర్లు ఉన్నాయి.ఆయనపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరి మనదేశంలో?గాంధీ జయంతులు తప్ప ఏమీ జరగడంలేదు. మాతృభాషలకుకాపాడుకోవడం ఎంత అవసరమో,గాంధీజీ బోధనలను కొత్త తరాలవారికి విడమరిచి చెప్పడం అవసరం. పదోతరగతి వరకు గాంధేయ వాదాన్ని పాఠ్యాంశంగాచేర్చాలి. భారతదేశంలోగౌతమ బుద్ధుడి తర్వాత అంతటిమహనీయుడు గాంధీ అని విదేశీ మేధావులుచెబుతున్నా మన పాలకుల చెవుల్లో సీసంకూరుకుపోయింది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X