వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూరి చుట్టూవార్తలు

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడుపరిటాల రవీంద్ర హత్య కేసు చిక్కుముడివీడినట్లేనా? వీడినట్లేనని మీడియావ్యాఖ్యానిస్తోంది. పరిటాల హత్యకు సంబంధించికీలకమైన క్లూ దొరికిందని పోలీసుడైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)స్వరణ్‌జిత్‌ సేన్‌ శుక్రవారం మీడియాప్రతినిధుల సమావేశంలో చెప్పారు.మహబూబ్‌నగర్‌లో రేఖమయ్య అనేవ్యక్తి లొంగిపోయి పరిటాల హత్యలో తానుకూడా పాల్గొన్నానని చెప్పడం, అతనిమాటల్లోని సత్యాన్ని ధృవీకరించుకోవడానికిపోలీసులు పరిశీలనలు చేయడం వంటిఅంశాలతో పరిటాల హత్య కేసు చిక్కుముడివీడినట్లు చెబుతున్నారు. ఇదిలా వుంటేబళ్లారిలో కీలకమైన వ్యక్తిని ఒకర్నిపోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలువెలువడుతున్నాయి.

శుక్రవారంరేఖమయ్య అలియాస్‌ రాజును పదిహేనుగంటల పాటు ఇంటరాగేట్‌ చేశారు. పరిటాలహత్యకు చర్లపల్లి జైలులో ఉన్నమద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డిఅలియాస్‌ సూరితో పాటు మొత్తం తొమ్మిదిమంది పథకం రచించి అమలు చేసినట్లుపోలీసులు అనుమానిస్తున్నారు. సూరితోఒప్పందం కుదుర్చుకొని నారాయణరెడ్డి(మహబూబ్‌నగర్‌ జిల్లా), శ్రీనివాస్‌ రెడ్డిఅలియాస్‌ విజయకుమార్‌ రెడ్డి అలియాస్‌రఘునాథ రెడ్డి (కరీంనగర్‌ జిల్లా),శ్రీనివాస్‌ రెడ్డి, కొండారెడ్డి, మరో వ్యక్తి(కర్నూలు జిల్లా), ఓబుల్‌ రెడ్డి, అనంత్‌అలియాస్‌ రైస్‌ మామ (అనంతపురం)హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.వీడియో క్లిప్పింగ్‌ల ద్వారాఅనుమానితులను పోలీసులు గుర్తించినట్లుసమాచారం జరుగుతోంది.

రవినిహత్య చేసిన తొమ్మిది మందిలోముగ్గురు ఇన్‌ఫార్మర్లని, శ్రీనివాస్‌ రెడ్డిమెయిన్‌ షూటరని, కవర్‌ షూటర్‌రేఖమయ్య అని వార్తలువెలువడుతున్నాయి. రవి హత్యకుకోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లుకూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈమొత్తాన్ని సమకూర్చింది బంగారు బాషానట.ఇతను పరారీలో ఉన్నట్లుచెబుతున్నారు. మద్దెలచెర్వు సూరిసెల్‌ నెంబర్‌ను కూడా పోలీసులుకనిపెట్టినట్లు చెబుతున్నారు. కథంతాసూరి జైలు నుంచి నడిపించాడనేదానిపైదృష్టి కేంద్రీకరించి రవి హత్య కేసుదర్యాప్తు ముందుకు సాగుతున్నట్లుప్రస్తుతం వెలువడుతున్నవార్తలను బట్టి అర్థమవుతోంది.రెండు నెలల పాటు పథకం రచనసాగినట్లు, అందుకు రంగం సిద్దంచేసుకున్నట్లు, అనంతపురంలోనేకాల్పుల్లో శిక్షణ పొందినట్లు వార్తలువెలువడుతున్నాయి.

ఇదిలాఉంటే, పరిటాల రవీంద్ర హత్య జరిగిన కొద్దిసేపటికే మాజీ నక్సలైట్ల మీదికి మీడియాదృష్టి వెళ్లింది. ఇందులో ప్రధానంగాజడల నాగరాజు ప్రస్తావన వచ్చింది. అతనికిసంబంధించిన పాత కథనాలతోఅనుమానాలు రేకెత్తిస్తూ వార్తలు వచ్చాయి.నయాముద్దీన్‌పైనా అనుమానాలు వ్యక్తంచేశారు. జైల్లో సూరికి, నయాముద్దీన్‌కుసంబంధించిన వార్తలు హాట్‌కేకుల్లావెలువడ్డాయి. నయాముద్దీన్‌ సోదరితరుచూ సూరితో మాట్లాడడానికిచర్లపల్లి జైలుకు వచ్చేదని కూడారాశారు. ఈ వార్తలను నయాముద్దీన్‌ఖండించాడు.

మొత్తంమీద, పరిటాల హత్యకు ప్రధానకారకుడిగా మద్దెలచెర్వుసూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరినిచూపిస్తూ వార్తలు వెలువడుతున్నాయి.రాజకీయ కోణం నుంచి మొత్తం మీదవార్తలు ఫాక్షన్‌ కక్షల వైపుమళ్లినట్లు అర్థమవుతోంది. సూరి, పరిటాలకుటుంబాలకు మధ్య తరాలతరబడిగా శత్రుత్వం ఉంది. పూర్తివివరాలు కొంతకాలం ఆగితే తప్ప బయటపడవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X