కొడుకులు!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 03-10-2005
హైదరాబాద్:వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిఅభ్యర్ధిగా ఫోకస్ చేసే అవకాశాలుఅధికంగా ఉన్నాయి. తనకు ప్రధాని అయ్యేఅవకాశం గతంలోనే వచ్చిందని, తానుఆ పదవి చేపట్టాలనుకుంటే ఆపేవారుఎవరూ లేరని రాహుల్‌గాంధీ ఇటీవలఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అతను ఒక నిర్ణయంతీసుకుంటే అంత తేలికగా మార్చుకునే రకం కాదని వివిధపార్శ్వాల నుంచి తెలుస్తోంది. అయితేసంకుచితంగా ఆలోచించకపోవడం,నిరాండంబరంగా ఉండడం, కొత్త విషయాలనుఆసక్తిగా తెలుసుకోవడం ఆయనలోనిసుగుణాలు. 1970 జూన్ 19న పుట్టినరాహుల్‌గాంధీకి 2009 ఎన్నికల నాటికి 39ఏళ్ళు వస్తాయి? ప్రధాన మంత్రి పదవిచేపట్టడానికి అది చిన్న వయసు అవుతుందా?భారతీయ రాజకీయ ప్రమాణాల ప్రకారంఅంతేనేమో?
ఎందుకీవారసత్వ రాజకీయాలు? వంద కోట్ల మందిభారతీయుల్లో ప్రధాన మంత్రిపదవికి అంత కంటే పెద్ద ఛాయిస్‌లేదా అని ప్రవాస భారతీయులు అనుకోవచ్చు.ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీల సమయంలోఈ వారసత్వ రాజకీయాలను కొందరుమేధావులు తీవ్రంగా విమర్శించినా రానురాను భారత రాజకీయాల్లో వారస్తత్వంచాలా మామూలు విషయమై పోయింది. ఉత్తరాదిలోనూఒరిస్సాలోనూ ముఖ్యమంత్రుల కొడుకులు వారితదనంతరం ముఖ్యమంత్రులయ్యారు. మనరాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడిది ఒకరకంగా వారసత్వమే. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంకాంగ్రెస్‌లోని దురంధరులకు ఇష్టముంటుందా? గతంలో ఇందిరాగాంధీని,రాజీవ్‌గాంధీని విమర్శించిన వారున్నారు. ఆతర్వాత అందరూ ఆ గొడుగు నీడన చేరిపోయారు. రాహుల్‌గాంధీ పేరుప్రకటించాలే కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ఇష్టం లేకపోయినా పైకిహర్షధ్వానాలు చేస్తారని ఒక కాంగ్రెస్ నాయకుడువ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ గురించి మరికొన్ని సంగతులు. భద్రతా కారణాల వల్ల ఆయనపాఠశాలవిద్యాభ్యాసం ఇంట్లోనే జరిగింది. ఢిల్లీలోని సెంట్‌స్టీఫెన్స్ కాలేజికి ఒక సంవత్సరంవెళ్ళిన ఆయన ఆ తర్వాత మానేశారు. హార్వర్డ్‌యూనివర్సిటీలోఎకనామిక్స్ చదవడానికి ఆయన 1990లోఅమెరికా వెళ్ళారు. ఎకనామిక్స్‌లో నాలుగేళ్ళ ఎబికోర్సుకు హాజరైనప్పటికీ ఆయనకు తగినగ్రేడింగ్స్‌లేనందువల్ల డిగ్రీ రాలేదు. రాజీవ్‌గాంధీ కూడా కేంబ్రిడ్జి నుంచి డిగ్రీసంపాదించలేకపోయారు. ఇందిరాగాంధీకూడా ఆక్స్‌ఫర్డ్ కాలేజి నుంచి డిగ్రీపొందలేకపోయారు. చదువు పూర్తి చేయనంతమాత్రాన ఇందిరాగాంధీని అసమర్ధ ప్రధానిఅనగలమా? కాబట్టిరాహుల్ విషయంలో ఆ అంశంఅభ్యంతరకరం కాదు.
రాష్ట్రంలోఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోఎందరో కాంగ్రెస్ నాయకుల పుత్రరత్నాలు మేయర్లుగా, మునిసిపల్‌ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. తనయులకోసం ఆ నాయకులు తినని గడ్డిలేదు.ఇక్కడ మనకు అభ్యంతరం కానివారసత్వం అత్యున్నత ప్రధాని పదవివిషయంలో ఎందుకు ఉండాలి? వారసులూజిందాబాద్! నీరసులూ (అర్హతలున్నాఅవకాశాలు రాలేదనుకునేవారు) డౌన్‌డౌన్.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
