ఒక హత్య, వందప్రశ్నలు

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 25-07-2005

హైదరాబాద్‌:రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంసృష్టించిన నవీష్‌మూర్తి హత్య కేసులోసైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌మహేందర్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హత్య కేసులో ప్రధాననిందితుడైన జనహర్ష గ్రూపు సంస్ధలఎండి రమణమూర్తిని అదుపులోకి తీసుకునిరహస్య ప్రదేశాల్లో ప్రశ్నిస్తున్నారు.రమణమూర్తిపై గతంలో అనేక కేసులుఉన్నందువల్ల ఆ కేసులకు సంబంధించి కూడా ఇంటరాగేషన్‌చేస్తున్నట్టు తెలిసింది.

సోమవారంఉదయం నవీష్‌మూర్తి భార్య పద్మావతిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కలిసిరమణమూర్తికి కఠిన శిక్షపడేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్నిలోపాలు లేకుండా పనిచేయించవలసిందిగాఆదేశించాలని ఒక వినతి పత్రం సమర్పించారు. గతంలోరమణమూర్తికి అనుకూలంగా పత్రికాప్రకటనలు ఇచ్చిన 100 మంది మేధావుల మీదచట్టప్రకారం చర్య తీసుకోవలసిందిగాఆమె కోరారు. నేరాన్నిప్రోత్సహించినందుకు భారతీయశిక్షాస్మృతి కింది వీరి మీద చర్యలుతీసుకోవాలన్నది ఆమె డిమాండ్‌. జనహర్షఆస్తులను సీజ్‌ చేయాలని, రమణమూర్తిఎడిటర్‌గా ఉన్న విజయవిహారం పత్రికను,జైభారత్‌ సంస్ధను నిషేధించాలని ఆమేకోరారు.

జనహర్ష రియల్‌ఎస్టేట్‌ సంస్ధకు వ్యవస్ధాపక చైర్మన్‌ తనభర్త నవీష్‌ మూర్తేనని, మార్కెటింగ్‌ఎగ్జిక్యూటివ్‌గా చేరిన రమణమూర్తి మోసంచేసి ఆ సంస్ధను చేజిక్కించుకున్నాడని నవీష్‌మూర్తి భార్య ముఖ్యమంత్రికి విన్నవించారు. ఇంజినీరుఅయిన తన భర్తను రమణమూర్తిమానసికంగా చిత్రహింసలు పెట్టి చివరికిప్రాణాలు తీశాడని ఆమె అన్నారు. రమణమూర్తినుంచి సమాజాన్నిరక్షించాలంటే అతనికి కఠిన శిక్షపడేలా చూడాలని ఆమె కోరారు.

రమణమూర్తినినిర్బంధంలోకి తీసుకున్నట్టు పోలీసులుఅధికారికంగా ప్రకటించడం లేదు.అనేక కేసుల విషయంలో అతడిని పోలీసులుప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. విజయవిహారంపత్రికలో పుట్టపర్తి సాయిబాబాకువ్యతిరేకంగా సీరియల్‌ కథనాలు ప్రచురించినరమణమూర్తిపై ఒకవర్గం పోలీసు అధికారుల్లో తీవ్రవ్యతిరేకత ఉంది. ఇప్పుడు పోలీసులకుచిక్కాడు కాబట్టి వారంతా ఒక లాబీగా ఏర్పడి,దైవ దూషకుడికి కఠిన శిక్షపడేలా కృషి చేస్తున్నారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+