మళ్ళీతిరుమల రోప్‌వే
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 17-05-2005
హైదరాబాద్:తిరుపతి నుంచి తిరుమల కొండ మీదికిరోప్‌వే నిర్మించాలని మళ్ళీప్రతిపాదించనున్నారు. గతంలోతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈప్రతిపాదన వచ్చినా ఆగమ పండితులువ్యతిరేకించారు. 150 కోట్లతో తిరుమలరోప్‌వే ప్రాజెక్టును టూరిజంకార్పొరేషన్‌ను ప్రతిపాదించింది. దీనిని ఆమోదించిననాటి ప్రభుత్వం ప్రాజెక్టు ప్రాధమికసదుపాయాల కోసం అలిపిరి వద్ద విశాలమైన స్ధలంకేటాయించింది. అయితే రోప్‌వే వల్ల పవిత్ర తిరుమలప్రాంతం వినోద పర్యాటక కేంద్రంగామారిపోయి ఆలయ పవిత్రతదెబ్బతింటుందని ఆగమ పండితులు,కొందరు టిటిడి బోర్డు సభ్యులుఅభ్యంతరం వ్యక్తం చేశారు.వివాదాలను కొని తెచ్చుకోవడమెందుకనిఅప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కామా పెట్టింది.
తిరుమలలోరోప్‌వే నిర్మాణం హిందూ మతవిశ్వాసాలకు, సంప్రదాయాలకు భంగకరమనిఆగమ పండితులు వాదించారు. విగ్రహంగామారక ముందు వెంకటేశ్వర స్వామిఏడుకొండల మీద నివసించాడని, కొండ మీదవిమానాలు, హెలికాప్టర్లుతిరుగరాదన్న నిబంధనలు ఉన్నాయనివారు పేర్కొన్నారు. ఏడుకొండల మీద సినిమాషూటింగులు కూడా నిషిద్ధం.
కాంగ్రెస్‌ప్రభుత్వం ఇప్పుడు రోప్‌వే ఫైలు దుమ్ము దులిపి పనులుప్రారంభించవలసిందిగా టూరిజంకార్పొరేషన్‌ను కోరినట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ఒక విదేశీ కంపెనీప్రమోట్ చేస్తోంది. ఆ కంపెనీ ప్రెసిడెంట్ ఇటీవలహైదరాబాద్ వచ్చి సంబంధితఅధికారులతో చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టునుప్రారంభించాలనుకుంటున్నరాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనకుటిటిడి బోర్డు ఆమోదం తెలుపవలసిఉంటుంది. ఇప్పుడు టిటిడి అధ్యక్షుడిగాటి.సుబ్బరామిరెడ్డి ఉన్నందున ఆయనప్రతిపాదన ఆమోదం పొందేలా చూడగలరన్నవిశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Recent Stories
సింధూర దేశభక్తి
షూటింగ్ కేసు రివైండ్
రాంగోపాల్ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్ కెరియర్
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్!
తల్లీకొడుకుల అపూర్వ గాధ
ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అమర్
కంచిపై ఇంటిలిజెన్స్ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
త్వరలో దాసరి ఛానల్!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి












Click it and Unblock the Notifications
