వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌కుఎదురుగాలులు!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 06-08-2005

YSRహైదరాబాద్‌:ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపైసొంతపార్టీ నాయకులే ఎదురుదాడికి దిగుతున్నారు. ఆ మధ్య జి.వెంకటస్వామి,ఇటీవల నేదురుమల్లి జనార్ధనరెడ్డి,నిన్న వి.హనుమంతరావు వివిధఅంశాలపై వైఎస్‌ మీద మాటల దాడి చేశారు.బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతోందని, వైఎస్‌ పెత్తందారుగావ్యవహరిస్తున్నారన్నది హనుమంతరావు ఆక్షేపణ. బిసీలఅండతోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంసాధించిందని, ఏరుదాటినతర్వాత తెప్ప తగలేసినట్టువైఎస్‌ వ్యవహరిస్తున్నారని ఆయనవిమర్శించారు.

వెంకటస్వామి,జనార్ధనరెడ్డి, హనుమంతరావులకు కాంగ్రెస్‌అధిష్టానం వద్ద చెప్పుకోదగ్గ విలువఉంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డికివ్యతిరేకంగా చేసే ప్రచారంలోవెంకటస్వామి, హనుమంతరావుకలిసి పనిచేసే అవకాశముంది. వారితో ఎన్‌జనార్ధనరెడ్డి కలవడం కష్టం.వైఎస్‌కు ఈ పదహారు నెలలకాలంలోఅధిష్టానవర్గం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. అయితే ఇటీవలకొన్ని వివాదాస్పద చర్యలుతీసుకున్న వైఎస్‌ వ్యవహారశైలి మీదహైకమాండ్‌ నిశితంగా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. వోక్స్‌వ్యాగన్‌వ్యవహారం వైఎస్‌ ప్రతిష్టనుదెబ్బతీసింది. ఆ వ్యవహారంలో విమర్శలుఎదుర్కొన్న బొత్స సత్యనారాయణనుమంత్రివర్గం నుంచితొలగించకపోవడం పట్ల అధిష్టానవర్గంఅసంతృప్తిగా ఉంది.

వచ్చేమునిసిపల్‌ఎన్నికలు వైఎస్‌ రాజశేఖరరెడ్డికిఅగ్నిపరీక్ష కానున్నాయి. అధికార పార్టీకాబట్టి కాంగ్రెస్‌ ధనబలంతో ఎక్కువమునిసిపలిటీలను కైవసం చేసుకునేఅవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వవ్యతిరేకత ప్రజల్లో ప్రారంభమైనందున అది ఏ స్ధాయిలోఉందో కాంగ్రెస్‌ నాయకులుతెలుసుకోవాలనుకుంటున్నారు. జీతాలనుపెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంతో బేరసారాలు జరుపుతున్నారు.డిమాండ్లను పరిష్కరించకపోతేసమ్మె చేయాలని ఉద్యోగులు యోచిస్తున్నారు.గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులుకట్టకట్టుకుని కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు.వేయించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుతిరిగితేమున్సిపల్‌ ఎన్నికల్లోఅధికార పార్టీకి ఇబ్బందులుఎదురుకావచ్చు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X