వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొద్దు శీను సిన్మాసీను!

By Staff
|
Google Oneindia TeluguNews

సూరి బావకళ్ళల్లో మెరుపు చూడడానికే పరిటాలరవిని కాల్చి చంపాను అని సినిమా ఫక్కీలోచెప్పిన శ్రీనివాసరెడ్డిని, చర్లపల్లిజైలులో ఉన్న సూరిని సిబిఐ అధికారులు తమపద్ధతిలో ఇంటరాగేట్‌ చేస్తే కొన్ని వాస్తవాలుబయటపడే అవకాశముంది. శ్రీనివాసరెడ్డిఅలియాస్‌ ముద్దు శీనును గొప్ప షూటర్‌గాచిత్రీకరిస్తున్నారు. టీవీ ఛానల్‌కుఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో అతనిహావభావాలు సునిశితంగా పరిశీలించినప్పుడుఅతను నటిస్తున్నాడని, ఎవరోచెప్పమన్నట్టు డైలాగులు వల్లించాడనిస్పష్టంగా తెలుస్తుంది. సిబిఐ అధికారులు ఒకపని చేస్తే చాలు. మొద్దు శీను చేతికిరివాల్వర్‌ ఇచ్చి ఒక టార్గెట్‌పై కాల్చమనిచెప్పాలి. మొద్దు శీను షూటింగ్‌నైపుణ్యమేమిటో అప్పుడు తేలిపోతుంది.పరిటాల రవిని మాజీ నక్సలైట్లు కానీముంబాయి మాఫియా గానీ చంపి ఉంటారని,మొద్దు శీను లాంటి పాత్రలుడమ్మీలేనని సిబిఐ ఒక నిర్ధారణకువచ్చినట్టు చెబుతున్నారు.

సూరిప్రధాన అనుచరుడు, జూబిలీహిల్స్‌ కారుబాంబు కేసులో రెండో నిందితుడు పవన్‌కుమార్‌ రెడ్డి కాలికి ఫ్రాక్చర్‌అయిందంటూ చర్లపల్లి జైలు నుంచిఉస్మానియా ఆస్పత్రిలో చేరడంపైరకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. రవిహత్య తర్వాత సూరి చర్లపల్లిజైలులో సెల్‌ఫోన్‌ వాడకుండా కట్టడిచేయడంతో బయట ఏం జరుగుతున్నదోతెలుసుకోడానికి ప్రభుత్వ సహకారంతోపవన్‌ను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారనిఅనుమానిస్తున్నారు. పరిటాల హత్యకుముంబాయి మాఫియాను హైర్‌చేసుకోడానికి అవసరమైనంతమొత్తం చాలా ఏళ్ళుగా ఏ వ్యాపారంచేయకుండా జైలులో మగ్గుతున్న సూరిఅలియాస్‌ మద్దలచెర్వుసూర్యనారాయణరెడ్డికి లేదన్నదిమరో వాదన ఎవరో పూనుకుని భారీఎత్తున చందాలు వసూలు చేసి కుట్రనుఅమలు చేసి ఉంటారని, పోలీసు శాఖకు ఈసమాచారం తెలిసినా ఏమీ తెలియనట్టుఉండిపోయారని విన్పిస్తోంది. వారం రోజుల్లోమరో ఇద్దరు పరిటాల అనుచరులనుచంపిన తర్వాత పోలీసులకులొంగిపోతానని మొద్దు శీను టీవీఛానల్‌కు చెప్పి ఇరవై రోజులు అవుతున్నాఅతను స్వయంగా పోలీసులకులొంగలేదు. పోలీసులూ అతడినిపట్టుకోలేదు. పరిటాలను తానేకాల్చానంటున్న మొద్దు శీనునుపోలీసులకు అప్పగించాల్సిన నైతికబాధ్యత నీతులు చెప్పే ఆ టీవీ ఛానల్‌కులేదా అని నైతిక వాదులు ప్రశ్నిస్తున్నారు.కిరాయి హంతకుల ప్రకటనలను కూడాఇక టీవీ ఛానల్స్‌ ప్రసారంచేస్తాయేమోనని వీరుఛమత్కరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X