వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు పత్రికలతోతలనొప్పి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 08-12-2005

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎప్పుడూ ఒకరెండు పత్రికలను తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆ రెండు పత్రికలనుపొద్దున్నే చదివితే తనకు మూడ్‌ ఆఫ్‌అవుతుందని, ఆందుకే హాయిగా హిందూపత్రిక చదువుకుంటానని, తనకార్యదర్శులు ఆ రెండు పత్రికల్లోవచ్చిన ముఖ్యమైన వార్తలకటింగ్స్‌ను క్యాజువల్‌గా చదువుతానని రాజశేఖరరెడ్డితరచు తన కోటరీ వ్యక్తులకు చెబుతుంటారు. ఆ రెండు పత్రికలుతెలుగుదేశం పార్టీనితలకెత్తుకుంటున్నాయని వైఎస్‌ అభిప్రాయం. ఆ రెండు పత్రికలంటే వైఎస్‌పుత్రరత్నం జగన్‌మోహన్‌రెడ్డికి కూడా కంపరమే. జగన్‌బాబుసొంతంగా ఒక టీవీ ఛానల్‌పెట్టబోతున్నాడు. తన తండ్రి మీద ఒకవర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజలకుసమాచారాన్ని ఉన్నదిఉన్నట్టు అందించడానికి సొంతంగా ఛానల్‌పెడుతున్నట్టు ఆయనచెప్పుకుంటున్నారు.

మీడియావిషయంలోరాజశేఖరరెడ్డిది, చంద్రబాబు నాయుడిదిపూర్తిగా భిన్న వైఖరి. చంద్రబాబు నాయుడుమీడియా ప్రతినిధులను వివిధ మార్గాల్లోప్రలోభపరిచేవారు. ఆయన అన్ని మీడియాలను తన గుప్పిట్లో ఉంచుకోడానికితీవ్రంగా ప్రయత్నించేవారు.రాజశేఖరరెడ్డి అలా కాదు. మీడియా వల్లతాను అధికారంలోకి రాలేదని, మీడియావల్ల న్యూసెన్స్‌ వ్యాల్యూ తప్ప మరేమీలేదని ఆయన ప్రగాఢ విశ్వాసం. అయితేమీడియాలో తన అనుకున్న వారికిఆయన ఇప్పటికే రెండు ముఖ్యమైనపదవులు ఇచ్చారు. తన ఫిర్యాదుపత్రికాధిపతులపైనే కానీ పత్రికాప్రతినిధుల మీద కాదని వైఎస్‌ తరచుచెబుతుంటారు. జర్నలిస్టులకుప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగామూడు వెంచర్లలో జర్నలిస్టులకు ఇళ్ళస్ధలాలను కేటాయించింది. ఈ మూడువెంచర్లను కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులేఇచ్చారు. టిడిపి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు జర్నలిస్టులకు అధికారికంగా ఒకకాలనీని కూడా మంజూరు చేయలేదు.

షేక్‌పేటలోఎమ్మెల్యేలు, జడ్జిలు, జర్నలిస్టులకు నామ మాత్రపురేట్లకు ఇళ్ళ స్ధలాలు మంజూరు చేయాలనివైఎస్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.అయితే ముఖ్యమంత్రి మాటి మాటికీతిట్టి పోసే రెండు పత్రికల జర్నలిస్టులుఅర్హుల జాబితాలో ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఈసారి ఎంపిక ప్రక్రియను స్వయంగా చేయాలని వైఎస్‌యోచిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే ఆయన జర్నలిస్టు హౌసింగ్‌సొసైటీ అధికారాలను కుదించి, తనతాబేదార్లతో ఒక ఎంపిక కమిటీని నియమించారు. జర్నలిస్టులనాలుగో హౌసింగ్‌కాలనీ విషయంలో వైఎస్‌ ప్రభుత్వంఅప్రతిష్టను కొని తెచ్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X