వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపైడిలే డిటో డిటో

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 01-08-2005

హైదరాబాద్‌:తెలంగాణపై యుపిఎ సబ్‌ కమిటీ ఇంకాఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.రక్షణ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ నాయకత్వంలోని త్రిసభ్య సంఘంసమావేశమై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. జులై 24న ఉపసంఘంసమావేశం కావలసి ఉండగా పార్లమెంటుసమావేశాల కారణంగాప్రణబ్‌ ముఖర్జీ బిజీగా ఉన్నందువల్ల సమావేశంనిరవధికంగా వాయిదాపడింది. ఉపసంఘం అధ్యక్షుడు ప్రణబ్‌,సభ్యులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌, కేంద్రఐటి శాఖ మంత్రి దయానిధి మారన్‌లుఆగస్టు 26 వరకు పార్లమెంటు సమావేశాల్లో తలమునకలై ఉంటారు.కాబట్టి దాదాపు నెల రోజుల వరకు యుపిఎఉపసంఘం సమావేశమయ్యేఅవకాశం లేదు.

గతనెలవైఎస్‌తో సమావేశమైన తర్వాతటిఆర్‌ఎస్‌ అధినేత, కేంద్రమంత్రి చంద్రశేఖరరావులోగణనీయ మార్పువచ్చినట్టు కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు వ్యతిరేకిస్తే సోనియాగాంధీతోసహా అందరినీ రోడ్డుకు ఈడుస్తాననిప్రకటించిన చంద్రశేఖరరావులోఇప్పుడా దూకుడు తగ్గింది. దిగ్విజయ్‌ సింగ్‌దౌత్యంలో జరిగినవైఎస్‌-చంద్రశేఖరరావుల సమావేశంలోవారు ఒక అవగాహనకువచ్చినట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుపై తొందరపడకూడదని,పరిస్ధితులను అనుకూలంగా మలుచుకున్న తర్వాతేపావులు కదపాలని ఇప్పుడు చంద్రశేఖరరావుఅనుకుంటున్నారు. ఇప్పుడుతొందరపడితే కేంద్రమంత్రిపదవులు వదులుకోవాల్సిన పరిస్ధితులుఏర్పడతాయని, పదవులు కోల్పోతే ఈ మాత్రం ఫైట్‌కూడా ఇవ్వలేమనికెసిఆర్‌ ఉద్దేశం. ఈలోపు నరేంద్రతో కొన్నిదూకుడు ప్రకటనలు చేయించి తాను మాత్రంనిశ్సబ్దంగా ఉండి,తెరవెనుక కృషి చేయాలన్నదిఆయన వ్యూహంలా కనిపిస్తోంది.పులిచింతల మీద నరేంద్ర మాట్లాడుతున్నారే కానీ కెసిఆర్‌నోరుమెదపడంలేదు. తాను భారతదేశానికిమంత్రిని అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X