వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు కౌంటర్‌ ప్లాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:పదిహేనేళ్ళ క్రితం విజయవాడఎమ్మెల్యే రంగా హత్యకూ, ఇప్పడు టిడిపి ఎమ్మెల్యే పరిటాల రవి హత్యకూ ఉన్నసారూప్యతలు, తేడాలు ఏమిటి? ఇద్దరూ తమపార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చక్రం తిప్పిప్రత్యర్ధి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడుహత్యకు గురయ్యారు. 1988 డిసెంబర్‌లోవంగవీటి మోహనరంగా హత్య జరిగింది.అప్పుడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.విజయవాడలో రంగాది సింగిల్‌ పాయింట్‌ ఫార్ములాగాఉండేది. కమ్మవారికి వ్యతిరేకంగాకాపులతో సహా ఇతర కులాలన్నిటినీ ఏకం చేయడం.దేవినేని నెహ్రూ ఒక వర్గానికి, రంగామరో వర్గానికి నాయకత్వం వహించేవారు.ఒక వర్గం వారిని మరో వర్గం వాళ్ళు చంపుకోవడంఅక్కడ సర్వసాధారణంగా ఉండేది. నెహ్రూకిఒక వర్గం వాళ్లు పెద్ద మొత్తంలోస్వచ్ఛందంగా చందాలు ఇచ్చేవారు. రంగాఅనుచరులు మాత్రం పాతబెజవాడలోవ్యాపారుల నుంచి బలవంతంగా చందాలువసూలు చేసేవారు.

పోలీసువేధింపులు, తెలుగుదేశం ప్రభుత్వకక్ష సాధింపు ధోరణికి నిరసనగానిరాహార దీక్ష చేస్తున్న రంగాను తెల్లవారుజామునఆ శిబిరంలోనే హత్య చేశారు. అప్పటికిఆరేళ్ళుగా అధికారంలో ఉన్న తెలుగుదేశంప్రభుత్వం మీద ప్రజల్లో అంతర్లీనంగాఉన్న వ్యతిరేకత రంగా హత్యతోకన్సాలిడేట్‌ అయింది. రంగా హత్యానంతరంకొన్ని కోస్తా జిల్లాల్లో ఒక కులం వారిపై ఇతరకులాల వారు దాడులు చేశారు. తెలుగుదేశంపార్టీని ఎన్టీఆర్‌ కూడా కాపాడలేరన్న సంకేతాలుఅప్పటికే కన్పించసాగాయి.

పరిటాలరవి హత్యతో ఆనాడు జరిగినట్టే రాజకీయపరిణామాలు ఉంటాయా? రవి హత్య ఎన్నికలముందు జరిగితే ప్రభుత్వ వ్యతిరేకతక న్సాలిడేట్‌ అవుతుండవచ్చు. కాంగ్రెస్‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడాకాలేదు కాబట్టి ఇప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకతఅనే భావనకు తావు ఉండదు. రవి హత్యతోతెలుగుదేశం పార్టీ వారిలో బ్రహ్మాండమైనఐక్యత వచ్చింది. అధికార పార్టీ మీదఉద్యమ రూపంలో పోరాడాలన్న పట్టుదలటిడిపి నాయకుల్లో కేడర్‌లొ కన్పిస్తోంది.

రవినడిపిన రాజకీయాలు, ఫ్యాక్షన్‌ కార్యకలాపాలురంగాకు కొంత భిన్నమైనవి. ఇద్దరి పంథాలోనూఒకే ఒక సారూప్యత ఉంది. కృష్ణాజిల్లాలో ఆధిపత్యంవహిస్తున్న కమ్మ వారికి వ్యతిరేకంగాఇతర కులాలను రంగా కలుపుకొస్తే,అనంతపురం జిల్లాలో రెడ్డి దొరలఆగడాలను ఎజెండాగా చేసుకుని బిసి, ముస్లింవర్గాలను రవి సమైక్యం చేయగలిగారు.ఇదొక్కటే వారిద్దరి మధ్య సారూప్యత.రవివి ప్రగతి శీల భావాలు. రంగా లంపెన్‌వర్గాల ప్రతినిధి. అప్పుడూ ఇప్పుడూ పోలీసులుప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించారన్నదిబహిరంగ రహస్యం.

రంగాహత్య జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిఎన్టీఆర్‌ రాజీనామా చేశారా అని రాష్ట్ర మంత్రిబొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యనుమరణించిన సమయంలో రంగాకు భార్యగాఉన్న రత్నకుమారి విమర్శించారు. రంగానుహత్య చేసిన వారిని పార్టీలోకిచేర్చుకున్న కాంగ్రెస్‌కు రంగా పేరుఉచ్ఛరించే అర్హత లేదని ఆమె మంగళవారంవ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X