వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిధుల వేటవిద్యా సంస్ధలపై టిఆర్‌ఎస్‌ కన్ను?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 16-08-2005

హైదరాబాద్‌:నక్సల్స్‌తోప్రభుత్వం అమీతుమీ తేల్చుకోవడానికేసిద్ధపడుతున్న సూచనలుకనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లామక్తల్‌ శాసనసభ్యుడు చిట్టెంనర్సిరెడ్డితో సహా తొమ్మిది మందినిమావోయిస్టులు దారుణంగా హత్యచేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగాపరిగణిస్తోంది. నక్సల్స్‌పై నిషేధంవిధించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందనిఇప్పటికే డిజిపి స్వరణ్‌జిత్‌ సేన్‌చెప్పారు. నర్సిరెడ్డి హత్యనేపథ్యంలో మంగళవారంసాయంత్రం రాష్ట్ర మంత్రివర్గసమావేశం జరిగింది. ఈ సమవేశంలోనక్సల్స్‌ అణచివేతకు తీసుకోవాల్సినచర్యల గురించే ప్రధానంగా చర్చజరిగినట్లు సమాచారం.

నక్సల్స్‌అణచివేతకు గిరిజన బెటాలియన్‌ను ఏర్పాటుచేయాలనే ఆలోచనకు మంత్రివర్గసమావేశం వచ్చినట్లు సమాచారం. దీనిద్వారా ఒక దెబ్బతో రెండు పిట్టలనుకొట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. గిరిజనులకుఉపాధి కల్పించడంతో పాటు నక్సల్స్‌నుఎదుర్కోవడానికి ఇది పనికి వస్తుంది. గిరిజనబెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని ఏడెనిమిదినెలల క్రితమే ప్రభుత్వం ఒకనిర్ణయానికి వచ్చింది. అయితే గిరిజనబెటాలియన్‌ ఏర్పాటు చేస్తే ప్రతికూలఫలితాలు ఉంటాయని, తమ మనుగడకష్టమవుతుందని కొన్ని గిరిజన సంఘాలుఅభ్యంతరం తెలిపాయి. దీంతోప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితేఇప్పుడు అదే నిర్ణయాన్ని అమలులో పెట్టాలనిప్రభుత్వం యోచిస్తోంది.

అయితేనిషేధం విషయంలో కేంద్రం ఒకనిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేదిరాష్ట్ర ప్రభుత్వం నుంచివ్యక్తమవుతున్న అభిప్రాయంగావినిపిస్తోంది. నక్సల్స్‌ సమస్య దాదాపు 14రాష్ట్రాల్లో ఉన్నందున కేంద్రంనక్సల్స్‌పై నిషేధం విధిస్తేఅణచివేతకు మార్గంసుగమమవుతుందనేది ఆలోచన.అయితే నక్సల్స్‌పై నిషేధం విధించేవిషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయమనిఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాలఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు.

నక్సల్స్‌పైబలప్రయోగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితివ్యతిరేకిస్తోంది. చర్చలే నక్సల్స్‌సమస్య పరిష్కారానికి ఉపకరిస్తాయనిటిఆర్‌యస్‌ నాయకులువిజయరామారావు, మందాడిసత్యనారాయణ రెడ్డిమంగళవారం అన్నారు. రెండువైపులా హింస ఆగిపోవాలని వారన్నారు.ఎవరు ముందు, ఎవరు వెనకఅనే చర్చ అనవసరమని, హింసకుఇరు వర్గాలు స్వస్తి చెప్పి చర్చలకుముందుకు రావాలని వారన్నారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X