• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేనుతెలంగాణ అమ్మాయినే

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 08-05-2005

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుపార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితేతమ పార్టీ బలపరుస్తుందని భారతీయజనతా పార్టీ నాయకురాలు, సినీ నటివిజయశాంతి అంటున్నారు. ఒక ప్రైవేట్‌ టీవీఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానుతెలంగాణ కోసం చేసే పోరాటం గురించివివరించారు. తెలంగాణను ఉద్యమంద్వారానే సాధించుకోవాలని ఆమె అన్నారు.

కాంగ్రెస్‌తెలంగాణ రాష్ట్రం ఇస్తుందనేనమ్మకం తనకు లేదని ఆమెఅన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు సుముఖంగా వున్నదని,తెలంగాణ ఏర్పడుతుందని తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకులు కె.చంద్రశేఖర్‌ రావు, ఎ. నరేంద్రఅంటున్నారు. వారేం చేస్తారో చూద్దామని, దానికోసమే తాను నిరీక్షిస్తున్నానని ఆమెఅన్నారు. అందరూ వెళ్లి తెలంగాణాఇస్తారా, లేదా అని సోనియాను అడగాలని ఆమెఅన్నారు. అన్ని పార్టీలలోని తెలంగాణవారుపదవులు వదులుకుని సోనియాపై ఒత్తిడితేవాలని ఆమె అన్నారు.

బిజెపితెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖంగాఉన్నదని, తెలంగాణ కోసం తాను చేసేపోరాటానికి పార్టీ నుంచి బయటకు రావాల్సినఅవసరం లేదని ఆమె అన్నారు. గతంలోతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు వల్లనే బిజెపితెలంగాణ రాష్ట్రాన్నిఇవ్వలేకపోయిందని అన్నారు. ఇప్పుడుబిజెపికి ఆ అడ్డంకులు లేవని,తెలంగాణకు కేంద్ర, రాష్ట్రనాయకత్వాలు సుముఖంగా ఉన్నాయని ఆమెఅన్నారు.

పదవులపిచ్చి, డబ్బు పిచ్చి ఆపి తెలంగాణ రాష్ట్రంకోసం పోరాటం చేయాలని ఆమె అన్నారు. తానుతెలంగాణ కోసం ప్రాణ త్యాగానికైనాసిద్ధమేనని అన్నారు. తాను బిజెపిఅధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణకోసం అంతర్గత పోరాటం చేశానని ఆమెచెప్పారు. తన తెలంగాణ పోరాటంవిషయంలో తాను స్పష్టంగా ఉన్నానని ఆమెచెప్పారు. తనను తొందరగాతెలంగాణ కోసం ముందుకు రావాలనిఅడుతున్నారని ఆమె చెప్పారు.తెలంగాణకు మేలు జరిగితే చాలుననేఉద్దేశంతో ముందుకు వస్తున్నాననిఆమె చెప్పారు.

ప్యాకేజీఇవ్వడమంటే తెలంగాణ రాష్ట్రంఇవ్వకూడదనే కదా, అది సమ్మతంకాదని ఆమె అన్నారు. తాను ఏమీ ఆశించకుండాతెలంగాణ కోసం పోరాడుతానని ఆమెఅన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏపదవీ తీసుకోనని ఆమె అన్నారు. తనవెనక ప్రజలున్నారని, ప్రజలపై దేవుడిపైతనకు నమ్మకం పెట్టుకున్నానని, చావోబతుకో తేల్చుకోవడమేనని,మొండిధైర్యంతో ముందుకుసాగుతానని, తెలంగాణ ఉద్యమాన్నిసాగిస్తానని, అందుకు నిజాయితీ ఉండాలని ఆమెఉన్నారు. తనకు ఎనిమిదేళ్ల రాజకీయఅనుభవం ఉన్నదని ఆమె అన్నారు. ఎన్టీ ఆర్‌చేయలేదా? అని ఆమె అడిగారు.

తెలంగానవెనకబడిన ప్రాంతం, 40 యేళ్లనుంచి ప్రజలు అభివృద్ధిజరుగుతుందేమోనని చూశారు.నేను తెలంగాణ అమ్మాయినే. ఎవరూనమ్మలేదు. పదవుల కోసమేఅంటున్నారని అన్నారు. రామన్నగూడెంప్రజలే విజయశాంతి మా బిడ్డ అని చెప్పారు.అదంతా పక్కన పెడితేతెలంగాణకు న్యాయం చేయాలనివస్తున్నానని, అది తప్పా? నేనుచిత్తశుద్ధితో పని చేయడానికివస్తున్నాను. తిట్లను దీవెనలుగాస్వీకరిస్తాను. నేను తెలంగాణలోతిరిగాను. నాకు తెలుసు. అందుకేమాట్లాడుతున్నాను అన్నారు.

పైరవీలద్వారా తెలంగాణ వస్తుందనేవిషయంపై చంద్రశేఖర్‌ రావుసమాధానం చెప్పాలని, తెలంగాణకున్యాయం జరుగుతుందని కెసి ఆర్‌అంటున్నారని, జరగకపోతే తప్పకుండానిలదీస్తానని, అందుకే నిరీక్షిస్తున్నాని ఆమెఅన్నారు. తప్పకుండా తెలంగాణఏర్పడుతుందనే గట్టి నమ్మకంనాకుందని ఆమె అన్నారు.

విజయశాంతికిసంబంధించిన అడ్వర్ట్‌యిజ్‌మెంట్‌ ఒకటిఒక దినపత్రికలో అర్ధ పేజీ ఆదివారంనాడుఅచ్చయింది. తెలంగాణ కో ఆర్డినేషన్‌ పేర ఆఅడ్వర్టయిజ్‌మెంట్‌ వెలువడింది.ఇందులో విజయశాంతి తెలంగాణకు చెందినఅమ్మాయే అనే వార్తకు, తెలుగుదేశంపార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీగా చేసినవర్ణనకు ప్రాధాన్యం ఇచ్చారు. దీన్ని బట్టితెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకుఆమె కచ్చితంగా ముందుకు వచ్చేసూచనలే కనిపిస్తున్నాయి. Recent Stories

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X