వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యక్షయుద్ధం!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 04-07-2005

KCRహైదరాబాద్‌:మాటల మరాఠీ, టిఆర్‌ఎస్‌ అధినేత,కేంద్ర కార్మిక శాఖ మంత్రి చంద్రశేఖరరావు అనుకున్నంతపనిచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ భాగస్వామ్యంలోతీసుకోవడంలోవ్యూహాత్మకంగా వ్యవహరించినఆయన తాజాగా ఒక వ్యూహాన్ని అమలులోపెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపొత్తు, సీట్లసర్దుబాటు విషయంలో ఎంతో బెట్టుగా, ఒక వ్యాపారిలాగా వ్యవహరించినఆయన టిఆర్‌ఎస్‌ రాష్ట్ర మంత్రులతోరాజీనామా చేయించి మళ్ళీ పై చేయి చూపారు.

గత ఎన్నికలతర్వాత వైఎస్‌ కాకుండాతెలంగాణకు చెందిన ఎవరైనాముఖ్యమంత్రి అయి ఉంటే చంద్రశేఖరరావు ప్రత్యేకతెలంగాణ వ్యూహం సఫలమై ఉండేది.తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్‌సర్దుబాటులో అధిక సీట్లు రావడానికితెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నాయకులందరూ ఒక కారణం. ఆసమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డినిసీట్ల సర్దుబాటుపై అధిష్టానవర్గంసంప్రదించలేదు. ఆ సమయంలో పిసిసిఅధ్యక్షుడుగా ఉన్న డి. శ్రీనివాస్‌టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించిఅప్పటి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాలఇంచార్జి గులాంనబీ ఆజాద్‌కు టిఆర్‌ఎస్‌గురించి గోరంతలు కొండతలుగా చెప్పారు.బేరసారాల అనంతరంటిఆర్‌ఎస్‌కు ఉన్న బలం కంటే ఎక్కువ సీట్లులభించాయి. తీరా ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌తన కేటాయించిన సీట్లలో దాదాపు సగంమాత్రమే గెలుచుకోగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకివ్యతిరేకంగా వీచిన పవనాల వల్లకాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌లే కాకుండావామపక్షాలు కూడా గణనీయంగా విజయంసాధించాయి.

తెలంగాణ రాష్ట్రంసాధించడం, ఆ తర్వాత పంపకాలుసక్రమంగా జరిగేలా చూడడం లక్ష్యంగాకేంద్ర ప్రభుత్వంలో చేరినట్టు చాలా కాలంచెప్పుకున్న చంద్రశేఖరరావుఇటీవల తీవ్ర విమర్శల నేపధ్యంలో చాలారోజుల పాటు నోరు మెదపలేదు. ఇప్పుడుజనశక్తి అగ్రనేత రియాజ్‌ ఎన్‌కౌంటర్‌నేపధ్యంలో రాష్ట్రంలో మంత్రి పదవులకు రాజీనామాచేయాలని టిఆర్‌ఎస్‌అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది.ఇప్పుడు నక్సలైట్లకు, టిఆర్‌ఎస్‌కుఉమ్మడి శత్రువు రాజశేఖరరెడ్డి(ఒకప్పుడు చంద్రబాబు నాయుడు).రాయలసీమ రాజకీయాల్లో రాటు దేలినరాజశేఖరరెడ్డి టిఆర్‌ఎస్‌ మంత్రులరాజీనామాలను చాలా తేలిగ్గా తీసుకుని, షెడ్యూలు ప్రకారం విదేశీ పర్యటనకువెళ్ళిపోయారు.

ఇప్పుడేంజరగబోతోంది?

వైఎస్‌రాజశేఖరరెడ్డికి అధిష్టానవర్గంపరిపాలనా పరంగా పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.టిఆర్‌ఎస్‌ బలం గురించి, తెలంగాణ రాష్ట్రాన్నివిడదీయకుండా ఉండాల్సిన అవసరాన్నివైఎస్‌ ఇప్పటికే అధిష్టానవర్గానికితన శైలిలో వివరించి ఉన్నారు. టిఆర్‌ఎస్‌మంత్రుల రాజీనామా వల్ల కంగారుపడాల్సిన అవసరం లేదని ఆయన దిగ్విజయ్‌ సింగ్‌కు చెప్పి విదేశీపర్యటనకు బయలు దేరారు. టిఆర్‌ఎస్‌విడిపోవడం కాంగ్రెస్‌ అగ్రనాయకులకు,సోనియా గాంధీకి బాధ కలిగించేవిషయమే అయినప్పటికీ, వారువైఎస్‌ను దాటిపోయే అవకాశం లేదు.రేపో ఎల్లుండో సోనియా గాంధీ అపాయింట్‌మెంట్‌ఇచ్చాక చంద్రశేఖరరావు ఆమెకుకలిసినప్పటికీ ఆమె నుంచి ఆయనఆశించిన ఫలితం రాకపోవచ్చు. ఆయన, నరేంద్ర కేంద్రమంత్రి పదవులకురాజీనామా చేయక తప్పకపోవచ్చు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోమళ్ళీ ఎన్నికల ముందు అంటే మూడున్నర ఏళ్ళ తర్వాత కానీకాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఒక నిర్ణయంతీసుకునే అవకాశం లేదు.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X