వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయనాయకుల ఆస్తులపై విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 08-03-2005

YSRహైదరాబాద్‌:చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణజరిపిస్తామని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి చేసిన ప్రకటనకలకలం రేపింది. దీనివెనుక రాజకీయకారణాలు ఉన్నాయన్నది అందరికీతెలిసిందే. ప్రత్యర్ధులపై కక్షసాధించాలన్నది రాజశేఖరరెడ్డి ఉద్దేశంకాదని, అయితే కాంగ్రెస్‌ ఏకార్యక్రమం ప్రారంభించినా అవినీతి ఉందంటూచంద్రబాబు నాయుడు విరుచుకుపడడంసిఎంకు చిరాకు కలిగిస్తోందని వైఎస్‌సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.చంద్రబాబు పత్తిత్తు కాదని, అయినాఆయన అవినీతి గురించి మాట్లాడడంవిడ్డూరంగా ఉందని, అందువల్లనే వైఎస్‌ఇటువంటి ప్రకటన చేయ్వలసి వచ్చిందనిఅంటున్నారు.

చంద్రబాబునాయుడు దేశంలో కెల్లా అత్యంతధనికుడైన రాజకీయ నాయకుడని,ఆయనకు రెండు వేలకోట్ల ఆస్తులున్నాయనితెహల్కా డాట్‌ కామ్‌ 2000సంవత్సరంలోనే వెల్లడించింది. అప్పటిబిజెపి జాతీయ అధ్యక్షుడు బంగారులక్ష్మణ్‌ లంచగొండితనం, రక్షణ శాఖఅధికారుల అవినీతి భాగోతాలు వీడియోక్లిప్స్‌ను అప్పుడే తెహల్కా బయటపెట్టడంతో చంద్రబాబు ఆస్తులపై వారువెల్లడించిన నివేదికను జనంనమ్మారు. ఆ తర్వాత ఏం జరిగిందోతెలియదు కానీ తెహల్కా ఆ రిపోర్టునుఉపసంహరించుకుంది. ఆ నివేదిక వచ్చినతర్వాత చంద్రబాబు నాయుడు మరోమూడున్నర ఏళ్ళు అధికారంలో ఉన్నారుకాబట్టి ఆయన ఆస్తులు కనీసం ఆరువేల కోట్లరూపాయలకు చేరుకుని ఉంటాయనికాంగ్రెస్‌ మేధావుల అంచనా. కాంగ్రెస్‌చేపడుతున్న అభివృద్ధికార్యక్రమాలకు చంద్రబాబుఅడ్డుపడకుండా ఉండాలంటే ఆయననువిచారణ పేరిట బెదిరించడమేఉత్తమమని ముఖ్యమంత్రికి వీరు సలహాఇచ్చినట్టు తెలిసింది.

తమిళనాడులాగారాజకీయ పార్టీల మధ్య వైరం తీవ్రస్ధాయిలో ఉంటేనే ప్రజలకు నిజానిజాలుతెలుస్తాయి. అక్కడ జయలలిత మీదకరుణానిధి, కరుణానిధి మీద జయలలితవిచారణలు జరిపించడం, కోర్టు కేసులుపెట్టడం వల్ల ఉభయుల అవినీతి గురించి ప్రజలుతెలుసుకునే అవకాశం కలిగింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి ట్రెండ్‌వస్తే ప్రజలకున్న తెలుసుకునే హక్కుసార్ధకమవుతుంది. చంద్రబాబునాయుడు మీదనే కాదు గతంలోకాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినజనార్ధనరెడ్డి వంటి వారి మీద కూడావిచారణ జరిపించాలి. అంతే కాదు వైఎస్‌పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనమీద కూడా విచారణ జరిపించాలి.

Recent Stories

ఢిల్లీ పిలుపు ఒకమలుపు!
చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌ భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం

వైఎస్‌ అసహనం
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
ఐటీ మీద వైఎస్‌ దృష్టి హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X