వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుప్పుమంటున్నప్రచారాలు!

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డినిఅధిష్టానవర్గం త్వరలోతప్పించబోతోందన్న అభిప్రాయం ప్రజల్లోకలిగేలా టిడిపి-బిజెపిలు గోబెల్స్‌ ప్రచారంప్రారంభించినట్టు కన్పిస్తోంది. కొన్నిదినపత్రికలు కూడా అదే విధంగాసృజనాత్మకతను జోడించి ఢిల్లీ వార్తలనుప్రచురిస్తున్నాయి. ఇవన్నీఇప్పుడు శైశవ దశలో ఉన్న కాంగ్రెస్‌అసమ్మతి వాదులకు ఆక్సిజన్‌ అందిస్తున్నాయి.అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ఈప్రాపగాండా సాగుతోంది.

రాష్ట్రంలోనక్సలైట్‌ సమస్య నేపాల్‌నుతలపింపజేస్తోందని కేంద్ర మంత్రిప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించడానికి బిజెపి నాయకుడు విద్యాసాగరరావు తనక్రియేటివిటీని ఉపయోగించి రాష్ట్రంలోప్రభుత్వమనేదే లేదని ప్రణబ్‌ఉద్దేశమని, ఇది కాంగ్రెస్‌అధిష్టానవర్గం ఆలోచనలకుప్రతిబింబమని భాష్యం చెప్పారు. ఇకకొందరు తెలుగుదేశం నాయకులుఅధికారులను బెదిరిస్తున్న వైనం ఇంకావిచిత్రంగా ఉంది. వైఎస్‌ పూర్తికాలంఅధికారంలో ఉంటారని కొందరు అధికారులుకలల గంటూ ఆయన అడుగులకుమడుగులొత్తుతున్నారని, వైఎస్‌ దిగిపోయిన తర్వాత అటువంటిఅధికారులకు దండన తప్పదనితెలుగుదేశం నాయకులు పత్రికాప్రకటనలు చేశారు. వైఎస్‌దిగిపోతే మరోకాంగ్రెస్‌ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ టిడిపి-బిజెపినాయకులైతే ముఖ్యమంత్రి కారు కదా?అసలు వీరు చెప్పదలుచుకున్నది ఏమిటి?

అధిష్టానవర్గంఎక్కడో ఉంటుంది కాబట్టి, ఇక్కడ సంక్లిష్టసామాజిక సమస్యలు వారికి పూర్తిగా అర్ధంకావు కాబట్టి కొత్తలో ఏ ముఖ్యమంత్రికైనావారు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. కొత్తలోఫిర్యాదులు వచ్చినా పట్టించుకోరు. అయితే ఉచిత విద్యుత్‌పైఊగిసలాట, నక్సలైట్లతో ఆర్భాటంగా ప్రారంభించినచర్చల ప్రక్రియ ఆగిపోవడంఅధిష్టానవర్గానికి ఆందోళనకలిగించవచ్చు. అంత మాత్రం చేతవైఎస్‌ను ఇప్పుడే గద్దె దింపేతెలివతక్కువ పనిని అధిష్టానవర్గం చేయదు. అందుకు ఇంకాచాలా కాలం పట్టవచ్చు. టిడిపి,బిజెపి,మీడియా ప్రచారాలను నమ్మి కొందరు కాంగ్రెస్‌అసమ్మతి వాదులు అప్పుడే ఢిల్లీ యాత్రలు చేస్తున్నట్టువార్తలు వస్తున్నాయి.

చేతులెత్తేస్తున్నప్రభుత్వం
వైఎస్‌భయాలు, భ్రాంతులు!
కాంగ్రెస్‌జేబులో మోహన్‌బాబు?
కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?
ఒక అడుగు ముందుకు,రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌ పవర్‌
సమాంతర శక్తులు!
ఇందిరమ్మ భూమి
ఇదొక రాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీ మీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడో పవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X