భాగ్యనగరిగుండెల్లో భూకంపం
ఈనాడు గ్రూప్‌ను బహిష్కరిస్తేనేతాను నిర్మాతల మండలి నిర్ణయానికి కట్టుబడివుంటానని ఆయన అంటున్నారట. సినిమా అడ్వర్టయిజ్మెంట్లటారీఫ్లు తగ్గించాలనే నిర్మాతల కోరికను ఈనాడుగ్రూప్ అధినేత రామోజీరావు అంగీకరించకపోవడంతో ఆసమయంలో దాసరి ఆయనతో గొడవ పడ్డారు. దీంతోదాసరి సినిమా వార్తలను, కార్యక్రమాలను వేటినీ ఈనాడుగ్రూప్ ప్రచురించడం లేదు, ప్రసారం చేయడంలేదు. గ్రీకువీరుడు సినిమా ద్వారా దాసరి కుమారుడుఅరుణ్ సినిమా ఆరంగేట్రం చేస్తున్న కాలం అది. తన కుమారుడితొలి సినిమా వస్తుందనే విషయాన్ని కూడా లెక్కచేయకుండా తాను ఈనాడు గ్రూప్‌తో కలహాన్ని కొని తెచ్చుకున్నానని,అందువల్ల అందరూ ఈనాడు గ్రూప్‌ను వదిలేస్తే తప్పతాను నిర్మాతల మండలి నిర్ణయాన్ని తలదాల్చలేననిదాసరి నారాయణరావు అంటున్నారని ఆయన ఆంతరంగికులంటున్నారు. ఇటీవలఆయన రెండు సినిమాలు ప్రారంభించారు. ఆ సినిమాల ప్రారంభకార్యక్రమాలను వీడియో తీయించారు. ఈ వీడియో క్యాసెట్లనుదాసరి నారాయణరావు టివి ఛానల్స్‌కు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పుతున్నారు.దాసరి గనుక వాటిని టివి ఛానల్స్‌కు ఇచ్చేస్తే నిర్మాతలమండలి నిర్ణయం గంగలో కలుస్తుందనడంలోసందేహం లేదు.
హోమ్పేజి తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!