చిరు వచ్చినా నిలబడతాడా?

అయితే అధికారంలోకి రావడం వేరు, ఆ అధికారాన్ని కాపాడుకోవడం వేరు. చిరంజీవి కంటే ఎక్కువ రాజకీయ స్పృహ కలిగిన ఎన్టీ రామారావు ఎంత మంది మంచి సలహాదారులను నియమించుకున్నా, తన కులానికే చెందిన నాదెండ్ల భాస్కరరావు ద్వరా కాంగ్రెస్ చేసిన కుట్రకు అనతి కాలంలోనే బలి కావలసి వచ్చింది. అయితే ఎన్టీ ఆర్ తనకున్న చరిష్మాతో , తనకు తోచిన పద్ధతిలో ప్రజల మధ్య తిరగడంతో తిరిగి ఆయనకే అధికారం కట్టబెట్టాల్సిన పరిస్ధితి ఆనాడు ఇందిరా గాంధీకి ఏర్పడింది.
చిరంజీవికి 200 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే 148 సినిమాల్లో నటించిన ఆయన 30 శాతమే సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆయనకు 40 లోపు స్ధానాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయన పార్టీకి వస్తే 200 పైన స్ధానాలు వస్తాయి. లేకపోతే 40 లోపు స్ధానాలతో ఆయన సరిపెట్టుకోవలసి ఉంటుంది.
రాజశేఖరరెడ్డి మీద కోపంతో ఆ రెండు పెద్ద దినపత్రికలు ఇచ్చే మద్దతుతో చిరంజీవి పెద్ద సంఖ్యలో అసెంబ్లీ స్ధానాలు కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కమ్మ కులానికి చెందిన ఆ పత్రికల నేచురల్ చాయిస్ చంద్రబాబు నాయుడే అయినా, మొదట ప్రధాన శతృవైన వైఎస్ ను దెబ్బ కొట్టాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.
రాజశేఖరరెడ్డి హయాంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బాగా వత్తిడికి లోనైన విషయం పాఠకులకు తెలిసిందే. చంద్రబాబు నాయుడిని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చే విషయం సందేహంగా మారడంతో, తాత్కాలికంగా చిరంజీవికి గట్టి మద్దతు ఇచ్చి ( అది కూడా చంద్రబాబు నాయుడు చెవిలో వేసి) రాజశేఖరరెడ్డికి ఈ వర్షాకాలంలో కూడా చెమటలు పట్టించాలన్నది ఆ రెండు పత్రికాధిపతుల వ్యూహంగా కనిపిస్తోంది.
గతంలో ప్రజా బలం ఉన్నా ఎన్టీ రామారావు అధికారం కోల్పోవడం వేరే విషయం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, ఇంటర్నెట్ బలంగా ఉండడం చిరంజీవికి లాభించే విషయం. పాతికేళ్ళ క్రితం ఎన్టీఆర్ ఎన్ని అద్భుతాలు చేశారో, ఈనాడు చిరంజీవి అంతకంటే ఎక్కువ చేసే అవకాశాలు టెక్నాలజీ వల్ల లభించాయి. చూద్దాం, ఏం జరుగుతుందో... ఎక్కడా రాని ఈ ఆర్టికల్ ను మీ మిత్రులతో పంచుకోండి.












Click it and Unblock the Notifications