'మెగా' పవర్ ఇప్పుడు 'చిరు'

నిర్మాత అశ్వనీదత్ ఎలాగైతే చిరంజీవితో సినిమాలు తీసినంత కాలం ఆయనతో ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టుకుంటే అటువైపు కనీసం తొంగి చూడకుండా, తాను తెలుగుదేశం పార్టీ వాడినని సగర్వంగా చాటుకున్నారు. ఏ గూటి పక్షి ఆ పాట పాడుతుందన్నది మన సామెత. ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అన్నది కాదు, అశ్వనీదత్ తన గూట్లోకి తాను వెళ్ళాడా లేదా అన్నదే చర్చనీయాంశం.
చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీ గురించి గతంలో కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు ఉన్న భయాలు ఇప్పుడు తొలగిపోయినట్టే కన్పిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు బాహాబాహీగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాయి. చిరంజీవి పార్టీ ఇంత తొందర్లో ఇలా నిర్వీర్యం కావడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఇప్పుడు చిరంజీవి పార్టీ మూడో స్ధానానికి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ వ్యూహాలను తిరగరాసుకుంటున్నాయి. చిరంజీవి పార్టీకి చెందిన మేధావులు మాత్రం ఈ విషయాన్ని అంగీకరించనట్టు వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications