'ప్రజారాజ్యం' ఇలా ఉండకూడదేమో?

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి తన పార్టీ వ్యవహారాలపై ఆచితూచి వ్యవహరించడం ప్రత్యర్ధి పార్టీలకు పెద్ద లాభదాయక అంశంగా కన్పిస్తోంది. చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీలో టెంపో తగ్గిందన్న విమర్శలు రావడంతో ఆయన హడావుడిగా సిరిసిల్ల పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయన ఒక రాజకీయనాయకుడిగా కానీ ఒక నటుడిగా కానీ వ్యవహరించలేక ఉభయ భ్రష్టత్వం పొందారు.

చిరంజీవి పార్టీ ఇదే తరహాలో ముందుకు పోతే అది అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో చిరు మీద భారీ వ్యగ్యం వ్యక్తమైంది. ఒక అభిప్రాయం సామాన్య జనంలో కలుగక ముందే మొండిగా ప్రజల్లోకి వెళ్ళిపోవడం ఒక వ్యూహం. ఆ వ్యూహాన్ని ఎన్టీ రామారావు పాతికేళ్ళ క్రితమే విజయవంతంగా అమలు చేసి చూపించారు. చిరంజీవి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆయన తాను ఎన్టీఆర్ కంటే ఎక్కువని చెప్పుకోలేరు. ఎన్టీఆర్ కంటే తక్కువ అని ఒప్పుకుంటే తన రాజకీయ సినిమా ఆడదు. ఇంత పెద్ద డైలమాను చిరంజీవి ఇప్పుడు ఎదుర్కొంటున్నారు.

ఈ రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చానేమోనన్న ఫీలింగ్ సిరిసిల్ల పర్యటనలో చిరంజీవి మొహంలో స్పష్టంగా కన్పించింది. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత చిరంజీవి వెనుదిరగకూడదు.
అందుకోసం ఆయన పూర్తిగా తన వ్యూహాన్ని, స్క్రిప్టును మార్చుకోవలసి ఉంటుంది.
1. తన మీద తనకున్న అతి విశ్వాసం (ఓవర్ కాన్ఫిడెన్స్)ను చిరంజీవి బాగా తగ్గించుకోవాలి
2. తనకు ఎడమ, కుడిగా ఉన్న (రాజకీయాల్లో లెఫ్ట్ అండ్ రైట్) డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ ల సలహాలను ఆయన శిరోధార్యంగా భావించకూడదు.
3. చిరంజీవిని రాజకీయాల్లో కూడా ఒక మహా నటుడిగా మార్చి పబ్బం గడుపుకుందామని చూస్తున్న వారిని గుర్తించి ఆయన దూరంగా పెట్టాల్సిన అవసరముంది
4. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సామాజిక వ్యవస్ధ మీద, కులాల వారీగా రాజకీయాల్లో ఉన్న ప్రభావం మీద చిరంజీవికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ ఫర్మేషన్ అవసరం.
5. భారతదేశానికి సంబంధించినంత వరకు కులమే సామాజిక సత్యమని ఆయన గ్రహించాలి. కమ్యూనిస్టులు చెప్పే "వర్గం" భారతదేశంలో పనిచేయలేదన్న విషయాన్ని తెలుసుకోవాలి.
6. అన్నిటికీ మించి వంది మాగధులను ఆయన దూరంగా ఉంచగలగాలి. వారు ఆయన సామాజిక వాస్తవాలను గ్రహించకుండా చేస్తున్నారన్న విమర్శలు ఇటీవల "ప్రజారాజ్యం"లో చేరిన ఇతర పార్టీల నాయకుల ద్వారా వినిపిస్తోంది.
7. తాను 2004 ఎన్నికల్లోనే పార్టీ పెట్టి ప్రజల ముందుకు వస్తే పెద్ద విజయం సాధించి ఉండేవాడినన్న విషయాన్ని చిరంజీవి గ్రహించాలి.
8. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మీద దారుణమైన అవినీతి ముద్ర ఉంది. ఈ సమయంలో కొత్త మొహంతో ముందుకు వస్తున్న చిరంజీవి పార్టీని సమాజహితం రీత్యా స్వాగతం పలకాల్సిందే. కానీ అన్నప్రాసన రోజునే అవినీతి అన్న రీతిలో ముందుకు వస్తే ఎవరూ హర్షించరు.
ఈ అంశం మీద అభిప్రాయాలను పంపవలసిందిగా మా పాఠకులను కోరుతున్నాం. ఈ విషయాన్ని మీ మిత్రులతో ఈ-మెయిల్ ద్వారా చర్చించండి. మెరుగైన సమాజ నిర్మాణం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతను ఎవరో మోస్తారని అనుకోవద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+