ఇక చిరుపై మెగా వత్తిడి?brచిరంజీవి పార్టీని ముందుకు పోకుండా చేయడానికి పెద్ద పార్టీలు ప్రయత్నిస్తున్

చెన్న కృష్ణయ్య వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ ఉందని చిరంజీవి శిబిరం అనుమానిస్తోంది. చిరంజీవి పార్టీకి పెద్ద ప్రభావం లేకుండా చేయడానికి చెన్న కృష్ణయ్యను అధికార కాంగ్రెస్ పార్టీ ఒక పావుగా వాడుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటివరకు చెన్న కృష్ణయ్య అండర్ గ్రౌండ్ లో ఉండడం ఈ విషయాన్ని బలపరుస్తోంది.
చిరంజీవి అభిమానుల్లోకి కోర్ గ్రూప్ అధికార పార్టీ నుంచి ఇక మీదట ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా శాంతియుత ప్రదర్శనల ద్వారా ఎదుర్కోడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లాల వారీగా ముఖ్య కార్యకర్తలకు చిరు పార్టీ కార్యాలయం నుంచి సందేశాలు అందాయని తెలుస్తోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మేధావులు ప్రయత్నిస్తున్నట్టు చిరు అభిమాన సంఘాల ముఖ్య నాయకులు అనుమానిస్తున్నారు.
దీనికి తోడు చిరంజీవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సిడి కాపీ ప్రభుత్వం వద్ద ఉందన్న వదంతులు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉం దో తెలియదు. సాధారణంగా ఒక కొత్త పార్టీ మీద అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యులకు ద్వేషం ఉంటుంది. కానీ తన ప్రభుత్వ విజయాల మీద ఎంతో విశ్వాసంతో ఉన్న రాజశేఖరరెడ్డి మాత్రం కొత్త పార్టీల గురించి లైట్ గా తీసుకోమని, పెద్దగా పట్టించుకోవద్దని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ప్రధానంగా ఫోకస్ చేయాలను తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు.
ఇక మీదట జనంలోకి వెళ్ళనున్న చిరంజీవి అనేక సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆయన మీద పూలతో పాటు రాళ్ళు కూడా పడే అవకాశముంది. పూలంటే అభినందనలు, రాళ్ళు అంటే విమర్శలు. ఇంతకాలం నాలుగు గోడల మీద సున్నితంగా మసలిన చిరంజీవి ప్రజా జీవితంలోకి వచ్చి అనేక ఇబ్బందులను చవి చూడాలి. అందుకు ఆయన సిద్ధమైనట్టే కనిపిస్తోంది.
రోడ్ షోలలో కూడా చిరంజీవికి ప్రజల నుంచి ప్రతిస్పందన బాగా ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ రెమిడియల్ మెజర్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ఏవిధంగా ఉంటాయన్నది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications