కాంగ్రెస్ కూ నష్టం

కాంగ్రెస్ ఓటు బ్యాంకు అలాగే ఉంటుందని, మిగితా ఓట్లు తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్య చీలిపోతాయని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ప్రజారాజ్యం పార్టీ వల్ల కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని స్ధాపించడానికి అవసరమైనన్ని సీట్లను చిరంజీవి తెచ్చుకోలేకపోయినా, ఆ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు సమానంగా నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకులు ప్రజారాజ్యం లోకి రావడం లేదు. అది అధికార పార్టీ కావడం వల్ల వారికి ఇప్పటికిప్పుడు కొత్త పార్టీలో అగత్యం ఉండకపోవచ్చు. కానీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు రాని పక్షంలో చిరంజీవి పార్టీని ఆశ్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీరు వీలును బట్టి టిడీపి లేదా ప్రజారాజ్యం లేదా టీఅర్ ఎస్ పార్టీలను ఆశ్రయించవచ్చు. కొద్ది రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది.












Click it and Unblock the Notifications