చిరు పార్టీకి పునాది ఏది?

చిరంజీవి పార్టీకి ఒక సైద్ధాంతిక పునాది ఇప్పటివరకు ఏర్పడలేదు. అది ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారికి ఆశ్రయం కల్పించే పునరావాస కేంద్రంగా మారింది. చిరంజీవి అభిమానులు, వలసవాదులతోనే ఆ పార్టీ నిర్మాణం జరుగుతోంది. జనరల్ పబ్లిక్ మీద ప్రభావం చూపనంతవరకు చిరంజీవి పార్టీకి ఉన్నత భవిష్యత్తు ఉండే అవకాశాలు కన్పించడం లేదు. సామాన్య ప్రజానీకం మీద ప్రభావ వంతమైన ముద్ర పడాలంటే తక్షణ సమస్యల మీద, సామాజిక రుగ్మతల మీద ప్రచండంగా విరుచుకుపడాల్సి ఉంటుంది. కానీ చిరంజీవి అలా చేయడం లేదు. ఆయన సమస్యల మీద సౌమ్యంగా స్పందిస్తున్నారు.
చిరంజీవి సలహాదారుల మీద అసమర్ధులన్న ముద్ర బాగా పడుతోంది. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులను, చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని ఎన్నో ఏళ్ళుగా ప్రోత్సహించిన కాపు నాయకులను దూరంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడీయాలో ఉన్న చిరు సమాజిక వర్గం వారిలో కూడా అసంతృప్తి తొంగి చూస్తోంది. అయితే చిరంజీవి చండ ప్రచండంగా ప్రజాయాత్రల్లో ప్రసంగాలు వెద జల్లితే పరిస్ధితులు గణనీయంగా మారిపోవచ్చు.












Click it and Unblock the Notifications