టికెట్లు- క్యాష్ కౌంటర్లు

గత అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడైన కొడాలి నానికి ప్రతిష్టాత్మకమైన గుడివాడ టికెట్ ఇప్పించుకోవడమే గాక ఆయన తరఫున ప్రచారం చేశారు. ఫలితంగా నాని స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇప్పుడు జూ ఎన్టీఆర్ గన్నవరం టికెట్ పైరవీ చేపట్టడం స్ధానిక తెలుగుదేశం నాయకుల్లో అయోమయం కలిగిస్తోంది. నందమూరి తారకరత్న కూడా అదే టికెట్ పైరవీకి దిగడం మరింత అయోమయాన్ని కలిగిస్తోంది.
ప్రజారాజ్యం పార్టీ టికెట్ల కోసం మరీ ఇంత దారుణ పరిస్ధితి లేకపోయినా పవన్ కళ్యాణ్ తన అనుకున్న 10 మందికి, నాగబాబు కనీసం నలుగురికి, అల్లు అరవింద్ అరడజను మందికి టికెట్లు ఇప్పించుకోడానికి రహస్య ఎజెండాలను సిద్ధం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోను, తెలంగాణలోని తన నమ్మకస్తులకు టికెట్లు ఇప్పించుకోవాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డబ్బుకి కాకుండా స్నేహానికి ప్రాధాన్యం ఇస్తుండగా అల్లు అరవింద్ మాత్రం తన టికెట్ల విషయంలో కలెక్షన్ కింగ్ లా మారుతారని అంటున్నారు. పార్టీని నడిపించడానికి చాలా డబ్బు అవసరం కాబట్టి మోహమాటాలకు పోకూడదని అల్లు అరవింద్ చిరంజీవి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ టికెట్ల వ్యవహారం బంధువుల మధ్య చిచ్చుకు దారితీసేట్టు ఉంది.












Click it and Unblock the Notifications