టీవీ డ్యాన్స్ లు-అశ్లీల ట్రాక్ లు

అయితే తమ డాన్స్ లు,ఒంపుసొంపులు చూపి ఛానెల్స్ వారు టీఆర్ పి లు పెంచుకుంటారని తెలియని వయస్సులో ఉన్న అమ్మాయిలు ఈ పోగ్రాంకి అటెండయి తర్వాత వచ్చే అసభ్యకమైన కాల్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎవరు పర్శనల్ నెంబర్స్ ఇస్తున్నారో ఏంటో తెలియని స్ధితిలో ఇది జరుగుతోంది. మంచి కుటుంబాలనుండి వచ్చిన వారికి ఇవాళ రాత్రికి ఫలానా పబ్ లోకి రా! అంటూ లేదా నక్లెస్ రోడ్ లో కలుద్దామని లేదా మరో చోటో కలుద్దామనే ప్రపోజల్స్ వస్తున్నాయి. కాదన్న అమ్మాయిలకు అసభ్యకరమైన పదజాలంతో కాల్స్ కంటిన్యూ గా వస్తున్నాయి. దీనికి ఎవరు భాద్యత వహిస్తారన్నది,ఎవరకు చెప్పుకోవలన్నది తెలియని స్ధితి ఉంటోందని వారు వాపోతున్నారు.
ఇక మరో ప్రక్క జడ్జిలుగా వచ్చిన వారు విచిత్ర ప్రవర్తన, వారి సెటైర్స్ చాలా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ఈ మధ్య ఓ కన్నడ ఛానెల్ లో రియాలటీ షో పోగ్రాంకి అటెండయిన బెంగాళి అమ్మాయి సినజనీ సేన్ గుప్త(13 సం) కేస్ ఓ డార్క్ ఉదాహరణగా కనపడుతోంది. ఆ పోగ్రాంలో ఆమెను జడ్జిలు అందరి మద్యలో తమ మాటలతో సప్రెస్ చేయటం తో డిప్రెస్ అయి అనారోగ్యానికి గురై కాలు,చెయ్య పడిపోయే స్ధితిదాకా వెళ్ళింది.
ఇలా ఓ ప్రక్క బ్రోతల్ తరహా కాల్స్ , మరో ప్రక్క అతిగా వ్యవహరించే జడ్జీలు.. అమాయిక జనాన్ని ఇబ్బందిపెడుతున్నాయనేది నిజం.వీటిపై టీవీ ఛానెల్ యాజమాన్యాలు,గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకూ ఇలాంటి అనారోగ్యకర ధోరణులనుండి,పరిస్ధితుల నుండి మన అమ్మాయిల్ని మనమే కాపాడుకోవాలి ఏం చేస్తాం.












Click it and Unblock the Notifications