వర్మ 'రంగీలా' తెరవెనుక కథ

దూరం నుంచి చూస్తూ వెళ్ళిపోయేవాడుట. ఆమెను కలసి ఐలవ్యూ చెప్పమని వర్మతో సహా అంతా చెప్పి చూసేవారుట.అయినా అతనిలో కదలిక లేదుట. ఆ బాధలో అతను గంటలు తరబడి ఒక ఇరానీ హోటల్ లోగడిపేవాడుట. ఇంతలోకి ఆమె వేరే రిచ్ గా ఉండే కుర్రాడితో తిరగటం ప్రారంభించిందిట. ఇది చూసి వర్మ బ్యాచ్ అతన్ని కొడదామని ప్రపోజల్ పెట్టారుట. అయితే అతనే కరెక్టని రమేషే వారించాడుట. అప్పటికీ ఆమెని ఇంప్రెస్ చేయటానికి చెప్పులు మార్చి నైక్ షూశ్ వేసుకొచ్చాడుట. అందరూ అతన్ని చూసి నవ్వారుట కానీ ఫలితం లేదుట. ఆ క్యారెక్టరే అమీర్ ఖాన్ దిట.
ఇక మిలి(ఊర్మిళ) పాత్ర ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి తల్లిదిట. ఆవిడ ఆ రోజుల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేస్తూ అవకాశం కోసం స్టూడియో లకు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా ఉండేదిట. దాన్ని ఎడాప్ట్ చేసాడుట. ఇక జాకీ షరాఫ్ పాత్ర అయితే 'సౌండ్ ఆఫ్ మ్యూజిక్' అనే హాలివుడ్ మ్యూజికల్ రొమాంటిక్ కామిడీలో కౌంటిస్ అనే పాత్ర నుండి తీసుకున్నదిట.
ఇలా తయారైన కథని మొదట వర్మ శ్రీదేవి,నాగార్జున కాంబినేషన్ లో చేద్దాం,గెస్ట్ రోల్ గా రజనీకాంత్ ని అడుదామని డిసైడ్ అయ్యాడుట.అయితే నాగార్జున ఒప్పుకోలేదుట.దాంతో ఆయనతో గోవిందా గోవిందా చెయ్యాల్సి వచ్చిందిట.దాంతో చాలా కాంలం పాటు ఈ కథను మర్చిపోయాడుట.
ఇక అంతం సినిమా చేద్దామనుకున్నప్పుడు హీరోయిన్ గా మాధురీ దీక్షిత్ ని అనుకుంటే ఆమె దొరకలేదుట.ఏం చేయాలా అనుకుంటుంటే అప్పుడు నరసింహ సినిమాలో చేసిన ఊర్మిళను బోనీకపూర్ సజెస్ట్ చేసాడుట.వేరే ఆలోచన,టైమ్ లేకుండా ఆమెని తీసుకుని షూటింగ్ కి వెళ్ళిపోయాడుట.ఆ సినిమా లో ఓ పాట చిత్రీకరణకు వైజాగ్ లో డాన్స్ మాస్టర్ సుచిత్ర లేటయితే టైమ్ వేస్ట్ ఎందుకని ఊర్మిళను సంగీతానికి అణుగుణంగా నీ ఇష్టం వచ్చనట్లు డాన్స్ చెయ్యిమన్నాడుట.ఆమె రెచ్చిపోయి చేసిందిట.అప్పుడు ఆమెలోని డాన్సర్ ని చూసి ముచ్చటపడ్డాడుట.దాంతో ఆ రాత్రి మళ్ళీ రంగీళా చెయ్యాలనే ఆలోచన కలిగి ఆమెను మిలి పాత్రకు తీసుకున్నాడుట.
అలా రంగీళా రూపుదిద్దుకుందిట.ఇది వర్మ చెప్తున్న తెర వెనుక కథ.అయితే ఈ సినిమాను కె.విశ్వనాధ్ సీతామహాలక్ష్మి సినిమా చూసి ప్రేరణ పొంది చేసినట్లు చెప్తారు.అందులో చంద్రమోహన్ తన స్వీయ శక్తితో తాళ్లూరి రామేశ్వరిలో టాలెంట్ ని మేలుకొలిపి పెద్ద హీరోయిన్ అయ్యేందుకు సాయం చేస్తాడు. ఆమె ఎదిగిన తర్వాత అతన్ని కలవటానికి సరిపడదు.అప్పుడు జరిగే డ్రామా ఆ సినిమా . ఏది ఏమైనా వర్మ ఎలా చేస్తేనేం మంచి పాటలతో ...అమీర్ ఖాన్ మేలైన నటనతో రంగీళా బ్లాక్ బస్టర్ గా భాక్సాఫీసు దగ్గర నిలబడింది.












Click it and Unblock the Notifications