చిరంజీవి పార్టీ కౌంట్ డౌన్brచిరు పార్టీ ఏ స్ధాయిలో ఉండబోతోందన్నది రేపటి బహిరంగ సభ తేల్చనుంది.....

చిరంజీవి రేపు తిరుపతి బహిరంగ సభలో తన పార్టీ పేరును ఇతర వివరాలను వెల్లడించనున్నారు. చిరంజీవి దాదాపు పది నెలలుగా దాచి పెట్టిన విషయాలు రేపు సాయంత్రం వెల్లడి కానున్నాయి. తన రాజకీయ పార్టీ గురించి గత ఆదివారం నాడు చిరంజీవి నిర్వహించిన మీడియా సమావేశం అనూహ్యంగా విజయవంతమైంది. అయితే ఆ టెంపోను చిరంజీవి కొనసాగించగలరా అన్నది నేడు మిలియన డాలర్ల ప్రశ్న.
చిరంజీవి బహిరంగసభకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చినా ఆయన పార్టీకి అవి ఏ విధంగా ఓట్లుగా మారుతాయన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు బలంగా ఉన్నాయన్న సత్యం చిరంజీవికి తెలుసు.
రేపటి సమావేశంలో చిరంజీవి ఒక గట్టి పట్టుదలతో కాంగ్రెస్, టిడిపిల మీద దాడి చేస్తే తప్ప ఫలితం ఉండదన్న అభిప్రాయం చిరు శిబిరంలోనే ఉంది. చిరంజీవి తనదైన శైలిలో అన్ని పార్టీలు మంచివే, కాకపోతే తనది కొంచెం మెరుగైన పార్టీ అన్న రీతిలో మాట్లాడితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. చిరంజీవి అభిమానులు ఎమోషనల్ టైప్. వాళ్ళు సున్నిత స్వభావాన్ని హర్షించరు. ఈ వాస్తవం చిరంజీవికి బాగా తెలుసు. ఆయన సినిమా రంగంలో ప్రదర్శించిన వినయాన్ని ఇక్కడ చూపెడితే ఈ రాజకీయ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ చిరంజీవి రేపటి బహిరంగ సభలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ స్ధాయిలో ప్రతిపక్షాల మీద విరుచుకుపడితేనే చిరంజీవి పార్టీ ఒక పెద్ద స్ధాయిలో ఉండగలుగుతుంది. అలా చేయగలిగితే అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.












Click it and Unblock the Notifications
