చిరుపై వైఎస్ భారీ దాడి

ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు కొత్తగా చిరంజీవి పార్టీ మీద విరుచుకు పడుతున్నారు. చిరంజీవి పార్టీ పెట్టుకున్న కొత్తలో ఆయన మీద ఏమీ మాట్లాడని వీళ్ళు ఇప్పుడు ధోరణి మార్చుకుని చిరు మీద పెను దుమారం లేవనెత్తడానికి కారణాలేమిటి? ఇప్పటికిప్పుడు చిరంజీవి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కన్పించడం లేదు. కానీ ఆయన పార్టీకి యాభై స్ధానాల వరకు వచ్చే అవకాశముంది. అందరూ ఊహిస్తున్నట్టు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎక్కువగా ఆయనకు ఆ స్ధానాలు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల మీడియా విశ్లేషకులు చిరంజీవిని ఆ రెండు జిల్లాలకు పరిమితం చేశారు. ఆ రెండు జిల్లాలనుంచి ఇరవైకి పైగా స్ధానాలు వచ్చే అవకాశమున్నా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమల నుంచి ముప్పై స్ధానాలు ప్రజారాజ్యం పార్టీకి రావచ్చు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులకు, గౌడ ( శెట్టి బలిజ) కులానికి ఎంతో కాలం నుంచి వైరం ఉంది. ఇప్పుడు గౌడలు చిరంజీవి పార్టీని తీవ్రంగా వ్యతురేకిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు చిరంజీవిని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించారు. చిరంజీవి పార్టీకి సొంతంగా అధికారంలోకి వచ్చేటన్ని స్ధానాలు రాకపోవచ్చన్న నివేదిక ఆయన చేరడం వల్లనే వైఎస్ ఇలా చెలరేగిపోతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి.
చిరంజీవిని విమర్శిస్తే కాపుల ఓట్లు పోతాయన్న అపోహతో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడిప్పుడే ఆయనను లైట్ గా విమర్శించడం ప్రారంభించారు. రాజకీయాల్లో బాగా పండిపోయిన బాబు, వైఎస్ ల విమర్శలను సహృదయంతో తీసుకుని ముందుకు సాగిపోతే చిరంజీవికి మనసు బాగుంటుందేమో.












Click it and Unblock the Notifications