దీనికి ఎవరు 'సాక్షి'?

అయితే బయిట మీడియా బూమ్ నడుస్తూండటం(ఇది ఓ రకంగా వీరి పుణ్యమే)తో మీడియా వ్యక్తులకు విపరీతంగా జీతాలు పెర్గిపోయాయి. దాంతో అంతంత జీతాలు ఇచ్చి కేవలం ఎలక్షన్స్ కోసం వీరిని పోషించాలా అనేది ఒక ప్రశ్న వీరిని తొలిచేస్తోందనేది సమాచారం. ఇక ఎలక్షన్స్ బాగా దగ్గరపడ్డాయి...ఈ లోగా మనం మనకు కావల్సిన విధంగా మీడియా వ్యక్తులను ట్రైనింగ్ ఇచ్చుకోగలమా అన్నది ఓ సమస్య. అలాగే టీవి చూసే జనాల్ని మొదట అలవాటు చేసి..తరువాత ఎడిక్ట్ చేసి మన భావాలను అభినించగలిగేలా మార్చుకోగలమా అనేది మరో సమస్యగా కనపడుతోంది.
దీనికి పరిష్కారంగా కొందరు సీనియర్స్ లీడింగ్ లో ఉన్న ఛానెల్ ని కొద్ది కాలం పాటు టేకోవర్ చేస్తే ఆ సమస్య ఉండదు. పని పూర్తి అవుతుందనే అవగాహనకొచ్చారనేది వినపడుతోంది. అయితే ఆ ఛానెల్స్ లో కాస్తంత లీడింగ్ లో ఉన్నది...చిన్న విషయాన్ని పెద్దది చేసి సంచలన వార్తగా వండగల నైపుణ్యం కలిగింది టీవీ నైన్ అని వారు అర్దం చేసుకున్నారు. ఆ దిసగా పావులు కదుపుతున్నారు. ఇక ఛానెల్స్ కంటారా...అవి ఎలక్షన్స్ టైమ్ నాటికి ఎట్టి పరిస్ధితుల్లో ఎటో అటో దూకేస్ధాయి. కాబట్టి ముందే ఓ ఎగ్రిమెంట్ కొస్తే మేలనేది కొందరి సీనియర్ నాయకుల సూచనే గాక ఆడిటర్స్ ఆలోచన కూడాట. అందుకే అన్నం వండుకు కూర్చుంటే ఎప్పుడో ఒకప్పుడు తీరిగ్గా తినచ్చు. అలాగే ఛానెల్ పెట్టుకు కూర్చుంచే ఎప్పుడో ఒకప్పుడు మంచి బేరం తగలొచ్చు.












Click it and Unblock the Notifications