మూడేళ్ళు బాలయ్య దూరం!

Balakrishna
హైదరాబాద్: చంద్రబాబునాయుడితో ఆయన వియ్యంకుడు బాలకృష్ణకు పడడం లేదా? బాలకృష్ణ తెలుగుదేశం వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? చంద్రబాబునాయుడు వ్యవహార శైలి ఆయనకు నచ్చడం లేదా?

మరో మూడేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈలోపు సినిమాల్లో బిజీగా ఉండి కనీసం మూడు నాలుగు హిట్లు అయినా కొట్టాలని ఆయన అనుకుంటున్నారు. నందమూరి కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన టిడిపి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

పార్టీ అధ్యక్ష పదవిని బాలకృష్ణకు ఇచ్చి, చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఉండాలని ప్రసన్న రెడ్డి డిమాండ్. దీనిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య మనుషులు తన మీద ఇలా తిరుగుబాటు చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

తన తండ్రి స్ధాపించిన తెలుగుదేశం పార్టీని మళ్ళీ వెలుగులోకి తేవాలన్న పట్టుదలతో గత్ ఎన్నికల ముందు బాలకృష్ణ ముందుకు వచ్చారు. కానీ చంద్రబాబు తన మనుషులకు, బాగా డబ్బున్న వారికి టికెట్లు ఇచ్చుకోవడం బాలయ్యకు నచ్చలేదు. అయినా ఏంచేస్తాడు? తన ఆడ కూతురిని బాబు కొడుక్కి ఇచ్చాడు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది.మరో వైపు పెద్ద ఎన్టీఆర్ తనను "తెలుగు చీర లేవరా, దీక్ష్ భూని సాగరా" అంటూ కలలో కనిపిస్తున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్ధితి బాలకృష్ణది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+