హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి డైలమా!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి బాధలు అన్నీ ఇన్నీ కావు. శనికి భయపడి పరమ శివుడు అంతటి వాడే చెట్టు తొర్రల్లో దాక్కుని ఒకరోజంతా గడపవలసి వచ్చిందట. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి వాడికైనా అవసరమైనప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. గుడిసెల్లోకి వెళ్ళి ఇందిరాగాంధీలా వారితో అన్నం తింటున్నట్టు నటించాలి. చిరంజీవి ఇటువంటి వాటిని మనస్ఫూర్తిగానే చేస్తున్నా రాజకీయాల్లోని కుళ్ళు, కుతంత్రాలు ఆయనకు వంట పట్టడం లేదు.

స్వతహాగా చిరంజీవి కళాకారుడు. తనకు అత్యంత ఇష్టమైన తనకు ఎనలేని సంపదను, కీర్తిని ఇచ్చిన సినిమారంగానికి దూరమయ్యానన్న బాధ, కలుషితమైన రాజకీయాల్లోకి వచ్చానన్న పశ్చాత్తాపం ఆయన భావాల్లో కన్పిస్తున్నాయి. సినిమాల్లో నటిస్తున్నప్పుడు స్లిమ్ గా కన్పించడం కోసమైనా రోజూ కనీసం రెండు గంటలు ఆయన జిమ్ లలో వ్యాయామం చేసేవారు. ఇప్పుడు స్లిమ్ గా కన్పించడం అవసరం లేదు కాబట్టి ఆయన వ్యాయామాన్ని మర్చిపోయారు. ఫలితంగా బరువు బాగా పెరిగారు. దానికి తోడు ఎక్కువ మందికి షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల మణికట్టు నొప్పులు...అధిక బరువు వల్ల మోకాళ్ళ నొప్పులు ఆయనను పట్టి పీడిస్తున్నాయి.

చిరంజీవి లాంటి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి కావాలి. కాకపోతే మరో ఐదేళ్ళు హీరోగా వెలుగొందాలి. ఆయన ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. వచ్చే నాలుగేళ్ళను ఆయన ఇటు ప్రజాజీవితంలో సామాజిక మార్పులు తేవడానికైనా వెచ్చించాలి. లేదంటే తన డ్రీం రోల్స్ లో నటించి కళాకారుడుగా ఆ తపనను తీర్చుకోవాలి. ఈ రెండూ కాదనుకుంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న ఆశాభావంతో జనం మధ్య తిరుగుతూ ఉండాలి.

చిరంజీవిని కలుపుకుని పోవాలని అటు జగన్, ఇటు రోశయ్యలే కాకుండా చంద్రబాబు నాయుడు కూడా ఆరాటపడుతున్నారు. రోశయ్య తన బలం నిరూపించుకోవలసిన పరిస్ధితి వస్తే 18 మంది ఎమ్మెలేల బలం ఉన్న చిరంజీవి మద్దతు తప్పనిసరిగా అవసరమౌతుంది. కాంగ్రెస్ రెండుగా చీలిపోతే చంద్రబాబు నాయుడు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చితే ఇంకా కొన్ని స్ధానాలు అవసరమనుకుంటే అప్పుడు కూడా చిరు పార్టీ కీలకమౌతుంది. ఇవన్నీ జరుగకుండా రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే చిరంజీవి ఈ నాలుగేళ్ళు సినిమాలు, సామాజిక సేవ వంటి రంగాలపై దృష్టి పెట్టి కాలక్షేపం చేయవలసి ఉంటుంది. నెలకోసారి ఒక జిల్లాలో భారీ ఎత్తున అన్నదానం చేయడం కూడా మంచి ఐడియానే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X