కమ్మ కులంలో ముసలం?

Chandrababu Naidu
హైదరాబాద్: నన్నపనేని రాజకుమారి కాస్త ఓపెన్ గా, గుంటూరు మిర్చిలా ఘాటుగా మాట్లాడే మాట వాస్తవమే. ఆమె దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురంధరేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అందుకు నిరసనగా కారంచేడులో నేడు నన్నపనేనిపై రాళ్ళ దాడి జరిగింది.

ఎలాంటి సంఘటననైనా ధైర్యంగా ఎదుర్కొని ప్రత్యర్థులపై మాటల బాణాలు సంధించే టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఈరోజు భోరున విలపించారు. కారంచేడులో టీడీపీ కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఈరోజు ఘర్షణ జరిగింది. ఆ సందర్భంగా నన్నపనేని రాజకుమారి, కరణం బలరాంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. వారి కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రాజకుమారిని కాంగ్రెస్‌ కార్యకర్తలు వ్యక్తిగతంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అక్కడే అందరి ఎదుట భోరున విలపించారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్న ఆయన బంధువులను, ఆయన కులానికి చెందిన నాయకులను పైకి తీసుకొస్తూ టిడిపిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పురంధరేశ్వరిని, దగ్గుబాటి వెంఖటేశ్వరావును కాంగ్రెస్ లోకి తీసుకుని టికెట్లు ఇవ్వడం ద్వారా ఐదేళ్ళ మొత్తం కోస్తా ఆంధ్ర కమ్మవారిలో వైఎస్ చీలిక తేగలిగారు. ఇప్పుడు ఆ చీలిక మరింత పెరిగింది. కోస్తాలో చెప్పుకోదగిన బలమున్న కమ్మ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఈ దంపతులు కాకుండా కావూరి, రాయపాటి, లగడపాటి ఇందుకు ఉదాహరణ.

కమ్మ కులంలో ముసలం పుట్టించిన వైఎస్ మీద ఆ కుల వీరాభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళు పాలించినా సాఫ్ట్ గా వ్యవహరించారని, కాంగ్రెస్ రెడ్లలో ముసలం పుట్టించలేకపోయారని వీరి విమర్శ. చంద్రబాబు నాయుడు రెడ్డి కాంట్రాక్టర్లకు భయపడేవారని, ఇప్పుడు వైఎస్ రెడ్డి కాంట్రాక్టర్లను ప్రేమిస్తున్నారని, ఇద్దరి హయాంలోనూ రెడ్లకే ఫేవర్ జరుగుతోందని మరో విమర్శ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+