శోభకు చిరు, పవన్ మద్దతు?

చిరంజీవే శోభారాణి ద్వారా తనను తిట్టించారని, ఆ తిట్లకు స్క్రిప్టు ఆయనదేనని రోజా ఆనాడే వ్యాఖ్యానించిన నేపధ్యంలో ఇప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్ కూల్ వ్యాఖ్యలు ఆలోచన రేకెత్తిస్తున్నాయి. నేడు శోభారాణి ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమను దులిపేశారు. రోజా తరఫున నిలబడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను ఆమె తీవ్రంగా విమర్శించారు.
రోజాకు మద్దతుగా సినీనటుడు మురళీ మోహన్ విలేకరుల సమావేశం పెట్టి తనను విమర్శించడాన్ని శోభారాణి తప్పుబట్టారు. మురళీమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, ఆయన సమాజానికి చేసిన సేవ ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను దిగువ కులానికి చెందిన దానిని కాబట్టే తన మీద చర్యకు పట్టుబడుతున్నారని ఆమె అన్నారు.
పవన్ కల్యాణ్ మీద కొందరు అనుచిత విమర్శలు చేసినప్పుడు ఈ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎందుకు ఖండించలేదని ఆమె ప్రశ్నించారు. పవన్, చిరుల మీద విరుచుకుపడమని బాలకృష్ణ రోజాను రెచ్చగొట్టినట్టు తెరవెనుక కథనాలు వినిపిస్తున్నాయి. వాటిని విశ్వసించిన చిరు సోదరులు శోభారాణిని పరోక్షంగా వెనకేసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications