మాటలు కరువైన మాంత్రికుడు!

టీఅర్ ఎస్ బలహీనపడింది కానీ తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉందన్న వాదన ఉంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన పరిణామాలు, ఆ పార్టీలో తిరుగుబాట్లు నిజమైన తెలంగాణ వాదులను కలవరపరుస్తున్నాయి. కెసీఅర్ వల్ల కాకపోతే మరో నాయకుడి ద్వారా అయినా తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న ఆశలకు కామా పడే విధంగా ఇప్పటి పరిణామాలు సాగుతున్నాయి. కెసీఆర్ ఒక నియంతలాగా, దొరలాగా వ్యవహరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. టీఅర్ ఎస్ లో కెసీఅర్ కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిందన్న విమర్శ మరొకటి. టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణ మరొకటి.
"రెడ్లకు ఒక తెలంగాణ, ఎస్ సిలకు ఒక తెలంగాణ, వెలమలకు ఒక తెలంగాణ, ఎస్ టిలకు ఒక తెలంగాణ, బీసీలకు ఒక తెలంగాణ- ఇన్ని తెలంగాణలు అవసరమా?" అని ఒక తెలంగాణ మేధావి గతంలో ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళిత అభ్యర్ధే ఉంటారని ఐదేళ్ళ క్రితం కెసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆ తరహా ప్రకటనలు మానేశారు. పార్టీలో కుటుంబసభ్యుల పెత్తనం పెరిగింది. ఒక్క విషయం మాత్రం వాస్తవం. ఆయన మాటల మాత్రికుడే కాదు, రాజకీయంగా చాణక్యుడు. కాకపోతే ఆయన పావులు కావలసింతకన్నా నాలుగు రెట్లు వేగంగా కదులుతుంటాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డేయేకు మద్దతు ఇస్తామని ప్రకటించడం అటువంటిదే. అక్కడే తేడా జరుగుతోంది. కెసీఅర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదన్న అభిప్రాయం ఉంది.
రవీంద్ర నాయక్ తదితర రెబల్స్ కెసీఆర్ ను పెద్దగా ఇబ్బంది పెట్టలేరు. టీఅర్ ఎస్ లో తిరుగుబాట్లు టీవీ చానల్స్ కు పండుగలా ఉండవచ్చు కానీ కెసీఅర్ కు "ముందున్నది ముసళ్ళ పండగ" అని చెప్పలేం. ఎంపీగా అయినా ఆయన తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని ఐదేళ్ళు గడిపేయగలడు. ఈలోపు అక్కడక్కడ మాటలతో గడబిడ చేయగలడు. పాత వ్యూహాలు ఫలించలేదు కాబట్టి కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్దామని నేటి టీఅర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆయన చెప్పారు. స్ధిరంగా ఉండకుండా వ్యూహాలు మార్చుకోవడం రాజనీతిలో భాగమని, ఆయన చెప్పడం, విజయశాంతి వంటి కొత్త వారు చప్పట్లు చరచడం అయిపోయాయి. వచ్చేవారం మళ్ళీ జరగనున్న టీఅర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో మరిన్ని విశేషాలు ఉంటాయి.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications